Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్, ఇండియా కూటమి మధ్య సంబంధాలు అంతా సక్రమంగా ఉన్నాయనే బలమైన సంకేతాలు పంపేందుకు మమతా బెనర్జీ సిద్ధం అవుతున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న టీఎంసీ, ఆ తర్వాత బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేసింది. రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే, ఆయన వయనాడ్‌ని వదులుకుని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఉండేందుకు ఇష్టపడ్డారు.
Read Also: ONGC Recruitment : రాత పరీక్ష లేకుండా 262 పోస్టులను భర్తీ.. భారీగా జీతాలు..
ఇదిలా ఉంటే ప్రస్తుతం వయనాడ్ నుంచి ప్రియాంకాగాంధీని బరిలోకి దించబోతోంది కాంగ్రెస్. అయితే ప్రియాంకాగాంధీ కోసం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారబరిలో నిలవబోతున్నారు. ప్రియాంకా తరుపున దీదీ వయనాడ్ నుంచి ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ, ప్రియాంకాగాంధీ కోసం ప్రచారం చేయనున్నట్లు టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో ఇండియా కూటమి సమావేశంలో వారణాసి నుంచి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిలవాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. 2019 నుంచి కాంగ్రెస్ మదిలో ఈ ఆలోచన ఉన్నప్పటికీ, ఇది సాధ్యం కాలేదు. ఈ ఎన్నికల్లో ప్రియాంకా ఎక్కడ నుంచి పోటీ చేయలేదు.
ప్రస్తుతం వయనాడ్ సీటు రాహుల్ గాంధీ వదులుకోవడంతో ప్రియాంకా గాంధీ పోటీకి మార్గం సుగమం అయింది. వయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ 3.6 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ 29 స్థానాలను గెలుచుకుంది.