Mamata Banerjee: “ఓట్లను దోచుకున్నారు”.. బీజేపీపై మమతా తీవ్ర విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తోంది. ఈ సమయంలో సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చారు. బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగా బీజేపీ ముందుగా తమకు అనుకూలమైన ఫలితాలను చూపిస్తుందని తనకు ముందే తెలుసని, ఆ విషయాన్ని తాను ముందే ఊహించానని ఆమె అన్నారు. అయినప్పటికీ తాను, తన పార్టీ కార్యకర్తలు పులిపిల్లల వలే పోరాడుతామని చెప్పారు.
ఒక వీడియో ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. సీట్లు గెలుచుకోవడానికి ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను దోచుకున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాలతో కుమ్మకై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్ర పోలీసలుు పూర్తిగా కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లి, వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
Read Also: Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా జూనియర్ ఎన్టీఆర్
టీఎంసీ ఏజెంట్లు కౌంటింగ్ ప్రాంతాలను విడిచి వెళ్లోద్దని మమతా కోరారు. ఇది బీజేపీ పన్నాగమని, మొదటి రెండు మూడు రౌండ్లలో వారి ఫలితాలను ముందే చూపించి, మా ఫలితాలను తర్వాత చూపిస్తారని తాను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నారని మమతా ఆరోపించారు. సుమారు 100 చోట్ల రెండు మూడు రౌండ్ల లెక్కింపు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ నిలిపేశారని అన్నారు. టీఎంసీని అణిచివేయడానికి పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారని, బలవంతంగా ఆక్రమించుకోవడానికి కేంద్ర బలగాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
సాయంత్రం తర్వాత మేమే గెలుస్తామని, మూడు లేదా నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయినా, మొత్తం 14-18 రౌండ్లు ఉన్నాయి కదా అని కార్యకర్తలు, ఏజెంట్లు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే సరికి విజయం తృణమూల్ వశమవుతుందని అన్నారు.
#WATCH | Kolkata: TMC candidate from Bhabanipur and West Bengal CM Mamata Banerjee says, "Counting agents and candidates should not leave the counting centre. This is the BJP's plan, I have been saying this since yesterday that they will be shown ahead first. They have stopped… pic.twitter.com/jdU9OqxWEJ
— ANI (@ANI) May 4, 2026
తాజావార్తలు
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!