Mamata Banerjee: కర్ణాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోవడంపై ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే.. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం, డీఎంకే స్టాలిన్ కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: PM MODI : కాంగ్రెస్ పార్టీని విష్ చేసిన ప్రధాని మోడీ
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు దాటదని ఆమె అంచనా వేశారు. రానున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓడిపోతుందని ఆమె అన్నారు. కర్ణాటక ప్రజలు బహుళత్వాన్ని కోరకుకుంటున్నారని చెప్పారు. ఆధిపత్యం ప్రజలను అణిచివేయలేదని దీదీ అన్నారు. మార్పుకు అనుకూలంగా కర్ణాటక ప్రజలు తీర్పు చెప్పారని వారిని అభినందించారు. అధికార, మెజారిటీ రాజకీయాలు ఓడిపోయాయని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఈ కథలోని నైతికత రేపటి పాఠం అంటూ ఆమె ట్వీట్ చేశారు. బీజేపీకి ఇదే ముగింపు అని వారు 100 సీట్లు దాటుతారని తాను అనుకోవడం లేదని అన్నారు.
224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 113ని దాటేసి ఏకంగా 136 స్థానాల్లో గెలుపు ఖాయం చేసుకుంది. బీజేపీ కేవలం 64, జేడీఎస్ 20 స్థానాలకే పరిమితం అయింది.
