Mamata Banerjee: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనను దేవుడు ఒక పని కోసం పంపాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. కోల్‌కతాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మోడీ నను తాను దేవుడిగా భావిస్తే , ప్రధాని పీఠంపై కూర్చుని దేశాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి అతనికి ఒక దేవాలయాన్ని నిర్మించాలని అన్నారు. దేవుళ్లతో రాజకీయాలు చేసి అల్లర్లను ప్రేరేపించొద్దని సూచించారు.
‘‘ఒకరు తాను (ప్రధాని మోడీ) దేవుడని అంటారు. ఒక నాయకుడు జనన్నాథుడు మోడీ భక్తుడు అని అంటారు. ఆయనకు గుడి కట్టి పూజలు చేయండి, ప్రసాదం, పూలు సమర్పించండి. ఆయనకిష్టమైతే ధోక్లా కూడా అందచేస్తాం’’ అని ఆమె ఎగతాళి చేశారు. ప్రధాని మోదీ ఇటీవల ఒక న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జీవసంబంధమైనవాడిని కాదని, దేవుడిచే పంపబడ్డానని పేర్కొన్న నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pakistan: మోడీ ఓడిపోవాలని పాక్ కోరుకుంటోంది.. మాజీ మంత్రి అక్కసు..
ఇటీవల బీజేపీ నేత, పూరీ నుంచి పోటీలో ఉన్న సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. జగన్నాథుడు మోడీ భక్తులు అంటూ వ్యాఖ్యానించడం కూడా వివాదాస్పదమైంది. పాత్ర తన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు. తను అనుకోకుండా నోరుజారానని అన్నారు. దీనికి అతను ఉపవాసం దీక్ష కూడా చేపట్టారు.
ప్రధాని మోడీని విమర్శించిన మమతా బెనర్జీ మాట్లాడుతూ..‘‘ నేను చాలా మంది ప్రధానులతో పనిచేశాను. అటల్ బిహారీ వాజ్‌పేయి, నన్ను చాలా ప్రేమించేవారు. నేను మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ, నర్శింహారావు, దేవెగౌడలతో పనిచేశాను. అయితే, ప్రధాని మోడీ లాంటి వారిని నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటి ప్రధాని అవసరం లేదని అన్నారు. జూన్ 1న జరిగే చివరి దశ ఓటింగ్‌కి ముందు మంగళవారం కోల్‌కతాలో ప్రధాని మోడీతో పాటు, సీఎం మమతా బెనర్జీ మెగా రోడ్‌షోలు నిర్వహించారు.