Site icon NTV Telugu

Mamata Banerjee: ఢిల్లీలో మమత పర్యటన.. సునీతా కేజ్రీవాల్‌కు పరామర్శ

Mamatabanerjee

Mamatabanerjee

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆయన తల్లిదండ్రులను మమత పరామర్శించారు. తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆప్ రాఘవ్ చద్దా కూడా ఉన్నారు. శనివారం ఢిల్లీలో నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మమత ఢిల్లీ వచ్చారు. నీతి అయోగ్ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తానని ఆమె తెలిపారు.

ఇది కూడా చదవండి: Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యను ఘనంగా సత్కరించిన తెలంగాణ మంత్రి.. కారణమేంటంటే.?

ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కోసం ఇండియా కూటమి ఈనెల 30న జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. పలుమార్లు బైయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

ఇది కూడా చదవండి: Lok Sabha: కోర్టుల్లో పెండింగ్‌ కేసులపై కేంద్రం కీలక ప్రకటన.. ఎన్ని కేసులున్నాయంటే..!

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కేజ్రీవాల్ భార్య, ఆయన తల్లిదండ్రులను కలవడానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వచ్చారన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందారని తెలిపారు. మమత.. కేజ్రీవాల్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు.

 

 

Exit mobile version