వచ్చే ఏడాది ప్రారంభంలోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి నాలుగోసారి అధికారం కోసం మమత.. ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి. ఇంకోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ‘SIR’పై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ గురువారం నిరసనకు మమత పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రాతిపాదనను తీసుకొచ్చారు. అయితే ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి మసీదు నిర్మాణంలో పాల్గొనబోరని.. సందేశాన్ని ఎమ్మెల్యేకు తెలియజేసినట్లు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Governor Grandson Harassment: గవర్నర్ మనవడి భార్య వరకట్న ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు
బుధవారం బెంగాల్ మంత్రి బ్రాత్య బసు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ సమస్యను పార్టీ నాయకత్వం చూసుకుంటోంది. ఎమ్మెల్యే నిరంతరం తన అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. రేపు బహరంపూర్‌లో జరిగే ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఆయన హాజరవుతారని మేము ఆశిస్తున్నాము.’’ అని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR)కు నిరసనగా మమతా బెనర్జీ గురువారం భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా ముర్షిదాబాద్‌లో ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే భరత్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హుమాయున్ కబీర్‌ను కూడా పార్టీ ఆహ్వానించిందని, ఆయన ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
అయితే డిసెంబర్ 6న ముర్షిదాబాద్‌లోని బెల్దంగాలో బాబ్రీ మసీదు ప్రతిరూపానికి శంకుస్థాపన చేయాలనే ప్రణాళికను ఎమ్మెల్యే తీసుకొచ్చారు. అయితే హుమాయున్ కబీర్ ప్రకటనలు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తుంటే… ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారని వర్గాలు తెలిపాయి.