NTV Telugu Site icon

Mamata Banerjee: ఐక్యంగా ఉంటేనే బీజేపీ ఓడించగలం.. విపక్షాలకు మమత పిలుపు..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తన ఫేస్ బుక్ పేజీలో ప్రధాని నరేంద్రమోడీ ‘మన్ కీ బాత్’ ప్రోగాం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఏకం కావాలని అన్ని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సారి అందరూ కలిసి బీజేపీని ఓడించగలమని ఆమె అన్నారు.

Read Also: Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-10 నగరాలు

వారు అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, ఇతరులపై అఘాయిత్యాలు జరుతున్నాయని పరోక్షంగా బీజేపీని గురించి విమర్శించారు. మేము డబ్బు, శక్తి, కండబలం, మాఫియా, భయంకరమైప ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని.. మేము ఎప్పటికీ ఓడిపోమని కామెంట్స్ చేశారు. ఈ 12 ఏళ్లలో తమను ఆదరించినందరకు ప్రజలకు అభినందనలు తెలిపారు.

దేశంలో మార్పు అవసరమని, 2024 ఎన్నికలు మార్పుకు సంబంధించిన ఎన్నికలని, ఎన్ఆర్సీ పేరుతో అబద్దపు ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తోందని బీజేపీని విమర్శించారు. దీనికి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలన్ని ఏకం కావాలని ఆమె కోరారు. ఐక్యంగా ఉంటేనే ఈసారి బీజేపీ ఓడించగలమని, భూమిపై ఉన్న ఏ శక్తీ మనల్ని అడ్డుకోలేదని ఆమె అన్నారు. మే 2, 2021లో టీఎంసీ బెంగాల్ లో టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చింది.

Show comments