Malegaon blast: 2008 మలేగావ్ కేసు దర్యాప్తు సమయంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS)లో కీలక అధికారి అయిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ మెహిబూబ్ ముజావర్ సంచలన వ్యాక్యలు చేశారు. ఈ కేసులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను అరెస్ట్ చేయాలని తనను కోరారని చెప్పారు. బీజేపీ ఎంపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌తో సహా ఈ కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక NIA కోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా గురువారం రిటైర్డ్ ఇన్స్పెక్టర్ మెహిబూబ్ ముజావర్ ఈ వాదన చేశారు. సోలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భగవత్‌ని టార్గెట్ చేయాలని, ‘‘కాషాయ ఉగ్రవాదం’’ అనే కథనాన్ని బలంగా వినిపించాలని విస్తృత ఎజెండాలో భాగమని ఆరోపించారు.
ఇటీవల వెలువడిన తీర్పులో ఏటీఎస్ దర్యాప్తులతోని అనేక అంశాలు కల్పితంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. కోర్టు నిర్ణయం దర్యాప్తు సమయంలో ఏటీఎస్ చేసిన నకిలీ పనులను రద్దు చేసిందని మోహిబూబ్ అన్నారు. మొత్తం దర్యాప్తు రాజకీయంగా ప్రభావితమైందని, ఇది కొన్ని సైద్ధాంతిక సమూహాలను ఇరించే లక్ష్యంగా ఉందని అన్నారు. ముందుగా ఈ కేసును ఏటీఎస్ దర్యాప్తు చేసినప్పటికీ, ఆ తర్వాత ఎన్ఐఏ ఈ కేసును స్వాధీనం చేసుకుంది.
Read Also: Trump Tariffs: భారత్‌కు 25 శాతం టారిఫ్.. పాకిస్తాన్‌కు మాత్రం ఊరట..
ఒక నకిలీ అధికారి చేసిన దర్యాప్తును తీర్పు బహిర్గతం చేసిందని అన్నారు. ముజావర్ ఒక సీనియర్ అధికారి పేరును పేర్కొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సెప్టెంబర్ 29, 2008న మాలేగావ్‌లో జరిగిన పేలుడును దర్యాప్తు చేసిన ATS బృందంలో ఆయన ఒకరు, ఈ పేలుడులో ఆరుగురు మరణించారు, 101 మంది గాయపడ్డారు, మోహన్ భగవత్నువెళ్లి పట్టుకోవాలి’’ అని సదరు అధికారి తనను కోరినట్లు ముజావర్ చెప్పారు. ‘‘అప్పుడు ఏటీఎస్ ఏం కోరిందో చెప్పలేను. కానీ రామ్ కల్సంగ్రా, సందీప్ డాంగే, దిలీప్ పాటిదార్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురించి కొందరు వ్యక్తులు నాకు రహస్య ఆదేశాలు ఇచ్చారని, ఆ ఆదేశాలు అనుసరించేలా లేవని ఆయన చెప్పారు.
ఆ దేశాలను భయంకరమైనవి కాబట్టే నేను పట్టించుకోలేదని ముజావర్ వెల్లడించారు. ఆదేశాలు పాటించనందుకు తన 40 ఏళ్ల కెరీర్‌ను నాశనం చేశారు అని ఆరోపించారు. తన వాదనలకు మద్దతుగా డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కాషాయ ఉగ్రవాదం లేదు, అంతా నకిలీనే అని ముజావర్ అన్నారు. ఉత్తర మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో జరిగిన పేలుడులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన దాదాపు 17 సంవత్సరాల తరువాత, ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం బిజెపి మాజీ ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది