Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Maldives Ministers Post On Pm Modis Lakshadweep Visit Triggers Row On Social Media

Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్‌పై అక్కసు..

Published Date :January 7, 2024 , 3:02 pm
By Venu Goapl Reddy
Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్‌పై అక్కసు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటన మాల్దీవుల్లో ప్రకంపనలు సృ‌ష్టిస్తోంది. భారత్‌పై, ప్రధాని మోడీపై అక్కడి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల మహ్మద్ మొయిజ్జూ అధ్యక్షుడిగా గెలిచాడు. ఇతని నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ వ్యతిరేక చర్యల్ని అవలంభిస్తోంది. ఇదే కాకుండా అక్కడ ఉన్న 77 మంది భారత సైనికులను వెళ్లాలని ఆదేశిస్తోంది. మరోవైపు మొయిజ్జూ చైనాలో పర్యటించే పనిలో ఉన్నారు.

ప్రస్తుతం లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రి చేసి ట్వీట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది. 32 చ.కి.మీ విస్తీర్ణంలో 36 దీవులతో కూడిన లక్షద్వీప్‌లో పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని పర్యటన చేయడం ఆ దేశానికి నచ్చడం లేదు. మాల్దీవులు ఎంపీ జాహీద్ రమీజ్ తన అక్కసును వెళ్లగాక్కారు. తన ట్వీట్ లో ‘‘ భారత్ మాల్దీవులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీపడటంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది’’ అని అన్నారు. అంతే కాకుండా ‘‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని పర్యటన వీడియోను ట్యాగ్‌ చేస్తూ). మా దేశం అందించే సర్వీస్‌ను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు?అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’’ అని ట్వీట్ చేశారు.

Read Also: Viral News : ఈ హ్యాండ్ బ్యాగ్ కొనే బదులు..ఢిల్లీలో వందల ప్లాట్లు కొనుక్కోవచ్చు

లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ స్నార్కెలింగ్ ఫోటోలు వైరల్ అయిన తర్వాత మాల్దీవుల మంత్రి మరో ట్వీట్ చేశారు. ఆ దేశ యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియూనా ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోడీని తోలుబొమ్మ అని కామెంట్ చేశారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ట్వీట్‌ని డిలీట్ చేశాడు.

మయిజ్జూ ప్రభుత్వంలోని నేతలు ఇలా ప్రధాని మోడీని కామెంట్ చేయడాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆదివారం ఖండించారు. మంత్రి మరియం షియనా ఉపయోగించిన భాష భయంకరంగా ఉందని, భారత్ మన మిత్రుడని అన్నారు. అధ్యక్షుడు మయిజ్జూ ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే మాల్దీవుల తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • Lakshadweep
  • Maldives
  • PM Modi
  • President Mohamed Muizzu

తాజావార్తలు

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • CD Gopinath: భారత క్రికెట్‌‌లో ముగిసిన ఒక స్వర్ణయుగం.. తొలి టెస్ట్ విజేత ‘చివరి యోధుడు’ కన్నుమూత!

  • Shubman Gill Fined: మ్యాచ్ గెలిచినా గుజరాత్‌కు షాక్.. గిల్‌కు భారీ జరిమానా..!

  • Juvvaladinne Boats Missing Mystery issue: ఆ బోట్లు ఎక్కడ..? ఎవరి పాత్ర ఏంటి..?

  • Bangladesh Cricketers: క్రికెటర్ల శాలరీ పెరిగాయ్.. ఒకొక్కరికి ఎంతంటే..

ట్రెండింగ్‌

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions