Site icon NTV Telugu

Pakistan: అభినందన్‌ను పట్టుకున్న మేజర్ హతం.. అంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హజరు..

Asim Munir

Asim Munir

Pakistan: పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా 2019లో భారత్ చేపట్టిన ‘‘బాలాకోట్ ఎయిర్ స్టైక్స్’’ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అభినందన్ వర్థమాన్ అనుకోకుండా పాక్ ఆర్మీకి చిక్కారు. ఆ సమయంలో, ఆయనను పట్టుకున్న పాక్ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఇటీవల తాలిబాన్ దాడుల్లో హతమయ్యాడు. ఆయన అంత్యక్రియలను పాక్ సైన్యం పెద్ద ఎత్తున నిర్వహించింది.

Read Also: Iran: ఇజ్రాయిల్‌పై విజయం సాధించాము, అమెరికాకు చెంపదెబ్బ: ఇరాన్ సుప్రీం లీడర్..

పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ స్వయంగా మోయిజ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. దేశం తన అమరవీరులకు శాశ్వతంగా రుణడి ఉంటుందని మునీర్ అన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో మరణించిన ఇద్దరు సైనిక సిబ్బందిలో 37 ఏళ్ల మేజర్ షా ఒకరు, ఈ ఘర్షణలో పాకిస్తాన్ భద్రతా దళాలు 11 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. మంగళవారం పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో ఈ ఆపరేషన్ జరిగింది.

బుధవారం రావల్పిండిలోని చక్లాలా గారిసన్‌లో జరిగిన అంత్యక్రియలకు మునీర్ హజరయ్యారు. మేజర్ అబ్బాస్ ప్రతిఘటనను ఎదుర్కొంటూ గొప్ప ధైర్యాన్ని చూపించారని ఆయన తన విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. మేజర్ సయ్యద్ మోయిజ్ అబ్బాస్ షా షహీద్ అంత్యక్రియలకు సీనియర్ సైనిక మరియు పౌర అధికారులు కూడా హాజరైనట్లు పాక్ మీడియా వెల్లడించింది.

Exit mobile version