Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- 24 గంటలు గడవకముందే మరో రైలు ప్రమాదం
- ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- ససారం-ఆరా-పాట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న (ఆదివారం) ఉదయం ఢిల్లీ-నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ (12431)లోని రెండు కోచ్‌లలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆలోట్, విక్రమ్‌గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం ప్రయాణికులను వణికించింది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ-గయాజీ రైల్వే లైన్‌లోని ససారం రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఓ ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ససారం-ఆరా-పాట్నా ప్యాసింజర్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్లాట్‌ఫారమ్‌పై, రైలు లోపల ఉన్న ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. భయంతో పరుగులు తీయడం ప్రారంభించారు. ఈ సంఘటన సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో ప్యాసింజర్ రైలుకు చెందిన ఒక బోగీ పూర్తిగా కాలి బూడిదైంది. ఈలోగా, ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చామని ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ప్రాథమికంగా ఇది షార్ట్ సర్క్యూట్ అని తేలిందని, రైల్వే యంత్రాంగం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని కూడా ఆయన తెలిపారు.
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
యాజమాన్య వైఫల్యం కారణంగా రైలుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సకాలంలో నీరు, అగ్నిమాపక పరికరాలు ఉపయోగించి ఉంటే, రైలును మరింత నష్టం నుండి కాపాడి ఉండొచ్చని ప్రయాణికులు విమర్శించారు.
తాజావార్తలు
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?