NTV Telugu Site icon

Priyanka Gandhi: మహాత్ముడి చివరి మాట ‘హే రామ్’.. కాంగ్రెస్ ఎలా హిందూ వ్యతిరేకి అవుతుంది..

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం తన పార్టీ ‘‘హిందూ వ్యతిరేకం’’ అని వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 1948లో నాథూరామ్ గాడ్సే చేత కాల్చి చంపబడినప్పుడు మహాత్మా గాంధీ చివరి మాటలు ‘హేరామ్’ అని చెప్పారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్‌కి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటంలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు సహకారాన్ని ఆమె గుర్తు చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌పై హిందూ వ్యతిరే ముద్ర వేసిందని, మా పార్టీ అతిపెద్ద నాయకుడు మహాత్మా గాంధీ అని, సత్యం, అహింసా, సత్యవేవ జయతే అనే విధానంపై స్వాతంత్య్ర పోరాటం ఆధారపడిందని ఆమె చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం చాలా మంది ప్రాణత్యాగం చేశారని, గాంధీకి బుల్లెట్ గాయాలైన సందర్భంలో హేరామ్ అన్నారని, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ ఎలా అవుతుంది..? అని ఆమె ప్రశ్నించారు. రామ మందిర కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకాకపోవడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Palnadu: పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేష్ బాలాజీ నియామకం.. ఈసీ ఉత్తర్వులు

ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లు, సంపద పంపిణీపై కాంగ్రెస్ మానిఫెస్టో, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ వాటిని ఆస్త్రాలుగా మలుచుకుంది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని, బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ దుయ్యబడుతోంది. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించిందని బీజేపీ ధ్వజమెత్తుతోంది.

‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకకు బీజేపీకి ఆహ్వానం అందిందని, అందుకే ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకకు హాజరుకావడం తప్పుడు నిర్ణయమని చెప్పడం సరికాదని, ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని ఆమె అన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన ప్రియాంకా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ ‘మోదీ కి గ్యారెంటీ’ నినాదంపై విరుచుకుపడ్డారు. మతాలకు అతీతంగా తమ వాగ్దానాలు ఉంటాయని చెప్పారు.

Show comments