NTV Telugu Site icon

Maharashtra: శివసేన 53 ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు

Shivasena

Shivasena

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేనకు సంబంధించి మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి రాజేంద్ర భగవత్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో నోటీసులపై స్పందించాలన్నారు. నోటీసులు అందుకున్న వారిలో సీఎం ఏకనాథ్ షిండే క్యాంపులోని 39 మంది ఎమ్మెల్యేలకు,  ఉద్ధవ్ ఠాక్రేలోని 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు మాత్రం నోటీసులు ఇవ్వలేదు.

ఇటీవల రెండు వర్గాలు పరస్పరం అనర్హత వేటు వేయాలని కోరుతూ ఫిర్యాదు చేసుకున్నాయి. జూలై3, 4 తేదీల్లో స్పీకర్ ఎన్నిక, బల నిరూపణ సందర్భంగా ఇరు వర్గాల విప్ ధిక్కరించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఫిరాయింపు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లో శాసన సభ్యులు వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి కోరారు.

Read Also: CM KCR: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు మరణించాడు, దీంతో మెజారిటీకి 144 ఎమ్మెల్యేలు అవసరం కాగా ఇటీవల జరిగిన అవిశ్వాస పరీక్షలో ఏక్ నాథ్ షిండేకు 164 ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. వ్యతిరేకంగా 99 మంది ఓటేశారు.  ఈ సమయంలో షిండే వర్గం నియమించిన ప్రభుత్వ విప్ భరత్ గోగావాలే జారీ చేసిన విప్ ను ధిక్కరించారని ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలకు షిండే వర్గం నోటీసులు జారీ చేసింది. విశ్వాస పరీక్షకు ఒక రోజు ముందు రాహుల్ నార్వేకర్, శివసేన విప్ గా షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలే నియమించి.. ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభును తొలగించారు.