Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి 233 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. విపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణ పరాజయం పాలైంది. ఈ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఉద్ధవ్ శివసేన 20, ఎన్సీపీ శరద్ పవార్ 10, కాంగ్రెస్ 16 సీట్లను గెలుచుకుంది.
అయితే, ఈ పరాజయం తర్వాత విపక్ష కూటమి ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వైపు చూస్తున్నారు. బీజేపీ ‘‘ఆపరేషన్ లోటస్’’ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన (యూబీటీ) ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రధాని మోడీని వీరంతా కలవనున్నారు.
Read Also: Pawan Kalyan: ఐక్యమత్యం పై పవన్ కళ్యాణ్ ట్వీట్.. అల్లు అర్జున్ అరెస్ట్ గురించేనా?
గత వారం, ఠాక్రే వర్గం ఎంపీలు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోరగా, మంజూరు కాలేదు. గురువారం కూడా వారి అభ్యర్థన తిరస్కరించబడింది. అయితే, డిసెంబర్ 16 సోమవారం రోజు ప్రధానితో వీరి భేటీ షెడ్యూల్ అయింది. అయితే, ఈ సమావేశం ఖచ్చిత ఉద్దేశ్యం తెలియకున్నా.. ఏదో పెద్దగా జరగబోతుందని తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ఓటమి తర్వాత వీరంతా మోడీని కలవనుండటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలోని , ఇటూ మహారాష్ట్రలోనూ బీజేపీనే అధికారంలో ఉండటం, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రభావం చూపించపోవడాన్ని పరిశీలిస్తే, వీరంతా బీజేపీ సర్కార్‌కి కేంద్రంలో మద్దతు తెలిపే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శరద్ పవార్ ఎన్సీపీ ఎంపీలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నారనే వార్తుల వినిపిస్తున్నాయి.