Maharashtra Political Crisis: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా రాహుల్ నర్వేకర్ ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు, రేపు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, ఏక్ నాథ్ షిండే బలపరీక్ష కోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. తాజాగా ఏర్పడిన ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో తన సత్తాను నిరూపించుకుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీ పోటీపడగా నర్వేకర్ మెజారిటీ సాధించారు. స్పీకర్ గా ఎన్నికయ్యారు. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో నర్వేకర్ 164 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 107 ఓట్లు వచ్చాయి. స్పీకర్ ఎన్నికకు సమాజ్ వాదీ(ఎస్పీ) పార్టీ దూరంగా ఉంది. ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు అబూ అజ్మీ , రయీస్ షేక్ ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇదే విధంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు అయ్యారు.
Also Read
- India Iran Travel Advisory: ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
- Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్‌లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
Read Also: Konda Vishweshwar Reddy: నేడు బీజేపీలోకి చేవెళ్ల మాజీ ఎంపీ
అయితే స్పీకర్ ఎన్నిక సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీలో కొత్త నాటకీయత చోటుచేసుకుంది. ఎన్నిక కోసం సభ్యుల లెక్కింపు సమయంలో ఈడీ..ఈడీ అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. తాజాగా స్పీకర్ ఎన్నిక సమయంలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే వర్గం స్పష్టమైన మెజారిటీని చూపింది. దీంతో రేపు జరగబోయే బలపరీక్షలో కూడా మెజారిటీ మార్క్ 144ను సీఎం ఏక్ నాథ్ షిండే ఖచ్చితంగా అధిగమించనున్నారు. 160కి పైగా ఎమ్మెల్యేల మద్దతు షిండే, బీజేపీ ప్రభుత్వానికి ఉంది.
తాజావార్తలు
-
India Iran Travel Advisory: ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
-
Sachin Tendulkar-ICC: హ్యాట్సాఫ్.. ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు!
-
CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
-
160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్‌లు ఇవే..!
-
Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
ట్రెండింగ్
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!