Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- మరో ముగ్గురి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు.. టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఛిద్రమైన శరీరాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నివేదికల ప్రకారం.. నాందేడ్-భోకర్ హైవేపై వాకడ్ గ్రామం సమీపంలోని సీతాఖండి ప్రాంతంలో సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. భోకర్ నుంచి నాందేడ్ వైపు అతివేగంతో ప్రయాణిస్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వ్యాన్‌ను ఢీకొంది. ఢీకొన్న ధాటికి టాటా మ్యాజిక్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయి రోడ్డు పక్కకు పడిపోయింది. వ్యాన్‌లో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. 9 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాలు అతివేగంతో ప్రయాణిస్తున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
పెద్ద శబ్దం విన్న గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన మరో ముగ్గురిని భోకర్, నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వ్యాన్‌ను ఢీకొన్న తర్వాత ట్రక్కు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయాడు. అతడిని బయటకు తీయడానికి పోలీసులు, సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాయి. వ్యాన్‌లోని ప్రయాణీకులందరూ స్థానికులేనని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!