NTV Telugu Site icon

Election Schedule: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్ ఎప్పుడంటే..!

Cec

Cec

దేశ వ్యాప్తంగా మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండగా.. జార్ఖండ్‌లో 2025, జనవరి 5తో కాలపరిమితి ముగుస్తుంది. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉండగా.. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లున్నారు.

హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో విజయవంతంగా పోలింగ్ ముగిసినట్లు సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో అయితే ఎలాంటి హింస జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని స్పష్టం చేశారు.