Jharkhand And Maharashtra Elections 2024 Live UPDATES: ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీకి 288 సీట్లతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో భాగంగా 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఇక, ఉప ఎన్నికలు జరుగుతున్న పలు నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్నికలు కమిషన్ శాంతియుతంగా పోలింగ్ జరిగేలా చూస్తున్నారు. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
-
మహారాష్ట్రలో 58.22 శాతం, జార్ఖండ్‌లో 67.59 శాతం..
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ముగిసిన పోలింగ్.. మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల వరకు 58.22 శాతం, జార్ఖండ్ లో రెండో విడతలో 67.59 శాతం పోలింగ్ నమోదు..
-
భార్య పిల్లలతో కలిసి షారూఖ్ ఖాన్ ఓటు..
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, కొడుకు ఆర్యన్ ఖాన్‌తో కలిసి ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WATCH | Mumbai | Actor Shah Rukh Khan and his wife Gauri Khan, daughter & actor Suhana Khan and son Aryan Khan leave after casting their vote for #MaharashtraAssemblyElections2024. pic.twitter.com/ylCozqbn8c
— ANI (@ANI) November 20, 2024
-
UP by-polls: బీజేపీ అన్ని వ్యవస్థల్ని కూల్చేసింది..యూపీ కాంగ్రెస్ చీఫ్..
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని కూల్చేసింది. తమకు వ్యతిరేకంగా ఓటేసిన ప్రజల్ని ఇబ్బందులు పెడుతోంది. పోలీసులను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వంలోని అధికారులపై ఎన్నిక సంఘం చర్యలు తీసుకోవాలి.
#WATCH | UP by-polls | Lucknow: Uttar Pradesh Congress chief Ajay Rai says, " This govt has demolished all the system...people are being disturbed and this govt is making those people suffer who are voting against them. Even though action has been taken against Police, who… pic.twitter.com/Mwt5Yj9iR5
— ANI (@ANI) November 20, 2024
-
ఓటేసిన సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ రోజు మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
#WATCH | Actor Salman Khan leaves after casting his vote for #MaharashtraElections2024 pic.twitter.com/nQ2NlrlO1o
— ANI (@ANI) November 20, 2024
-
మహారాష్ట్రలో ఓటింగ్ శాతం 45.38, జార్ఖండ్‌లో 61.47 శాతం..
ఎలక్షన్ కమీషన్ ప్రకారం.. మధ్యా్హ్నం 3 గంటల వరకు మహారాష్ట్రలో ఓటింగ్ శాతం 45.38, జార్ఖండ్‌లో 61.47 శాతం..
-
ఓటు వేసిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ..
ఓటు హక్కు వినియోగించుకున్న రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా
#WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, his sons Anant Ambani, and Akash Ambani, and daughter-in-law Shloka Mehta arrive to cast their vote for the #MaharashtraElections2024 at a polling booth in Mumbai. pic.twitter.com/S4kN8mIsxK
— ANI (@ANI) November 20, 2024
-
మధ్యాహ్నం 1 గంట వరకు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ శాతం..
మధ్యాహ్నం 1 గంట వరకు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ శాతం
గిద్దర్‌బాహా (పంజాబ్) 50.09%
కుందర్కి (ఉత్తర ప్రదేశ్) 41.01%
డేరా బాబా నానక్ (పంజాబ్) 40.40%
పాలక్కాడ్ (కేరళ) 40.16%
మీరాపూర్ (ఉత్తర ప్రదేశ్) 36.77%
కతేహరి (ఉత్తర ప్రదేశ్) 36.54%
కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్) 34.40%
కర్హల్ (ఉత్తర ప్రదేశ్) 32.29%
మజవాన్ (ఉత్తర ప్రదేశ్) 31.68%
ఖైర్ (ఉత్తర ప్రదేశ్) 28.80%
సిషామౌ (ఉత్తర ప్రదేశ్) 28.50%
బర్నాలా (పంజాబ్) 28.10%
చబ్బెవాల్ (పంజాబ్) 27.95%
ఫుల్పూర్ (ఉత్తర ప్రదేశ్) 26.67%
ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్) 20.92%
-
జార్ఖంండ్ లో మధ్యాహ్నం 1 గంటల పోలింగ్ శాతం ఎంతంటే..
జార్ఖండ్ రాష్ట్రంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 49% పోలింగ్ నమోదైంది.
-
మహారాష్ట్రలో మధ్యాహ్నం 1 గంటల పోలింగ్ శాతం ఎంతంటే..
మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ లో మధ్యాహ్నం 1 గంటల వరకు 32.18 శాతం నమోదు అయిందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
-
ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఓటర్లను పోలీులు సస్పెండ్..
ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ ఐడిలను తనిఖీ చేయడంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో ఓటు వేయకుండా ప్రజలను ఆపిన పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను సమర్పించిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకుంది.
-
యూపీలో మధ్యాహ్నం 1 గంట వరకు ఎంత ఓటింగ్ జరిగింది?
యూపీలోని 9 స్థానాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఓటింగ్ శాతం ఇవే...
కుందర్కి సీటుపై 41.01 శాతం
కర్హల్ సీటుపై 32.39 శాతం
కతేహరి సీటుపై 36.54%
ఘజియాబాద్ స్థానంలో 20.92 శాతం
సిసమావు సీటుపై 28.50 శాతం
మీరాపూర్ సీటుపై 36.77 శాతం
మజ్వాన్‌పై 31.68 శాతం
వెల్ సీట్ 28.80%
ఫుల్పూర్ సీటుపై 26.67 శాతం
-
ఓటేసిన ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రేలు..
శివసేన (UBT) నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
-
పంజాబ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్- ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఉప ఎన్నికల సందర్భంగా డేరా పఠానా గ్రామంలోని పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్- ఆప్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనా స్థలంలో కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా కూడా ఉన్నారు.
#WATCH | Gurdaspur, Punjab: Clash broke out between Congress and AAP workers at the polling booth of village Dera Pathana. Congress MP Sukhjinder Singh Randhawa also present at the spot.
Voting was going on in Punjab's Dera Baba Nanak by-elections. pic.twitter.com/u6bLZhKwM0
— ANI (@ANI) November 20, 2024
-
మహారాష్ట్రలో బీజేపీ తప్పుడు వాగ్దానాలు చేస్తోంది: డీకే శివకుమార్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. బీజేపీ దాని కూటమి భాగస్వాములతో కలిసి ఫేక్ వాగ్దానాలు చేస్తోంది అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. మేము అన్ని కార్యక్రమాలను అమలు చేశాం.. ప్రజలు ఎంవీయూ కూటమికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.. ఎంవీఏ అధికారంలోకి వస్తుందని నాకు నమ్మకం ఉంది- డీకే శివ కుమార్
-
మీరాపూర్ బైపోల్ సందర్భంగా కక్రోలి గ్రామంలో ఘర్షణ..
యూపీలోని మీరాపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం ఓటింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా కక్రోలి గ్రామంలో రెండు గ్రూపులు రాళ్లతో ఘర్షణకు దిగాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
-
ఓటేసిన సీఎం ఏక్‌నాథ్ షిండే
థానేలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఓటు వేశారు.
#WATCH | Maharashtra CM Eknath Shinde casts his vote at a polling booth in Thane for #MaharashtraElections2024 pic.twitter.com/uewoXsiSPf
— ANI (@ANI) November 20, 2024
-
మరోసారి అధికారం మాదే: కల్పనా సోరెన్
జార్ఖండ్ లో మరోసారి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని జేఎంఎం నేత, కల్పనా సోరెన్ చెప్పారు.
-
యూపీలో ఎక్కడ, ఎంత శాతం ఓటింగ్ జరిగిందంటే..?
కుందర్కి - 28.54 శాతం
మీరాపూర్ - 26.18 శాతం
కతేహరి- 24.28 శాతం
కర్హల్ - 20.71 శాతం
మధ్యవన్ - 20.41 శాతం
బాగా- 19.18 శాతం
ఫుల్పూర్ - 17.68 శాతం
సిసమావు - 15.91 శాతం
ఘజియాబాద్- 12.87 శాతం
-
జార్ఖండ్ లో ఉదయం 11 గంటల వరకు ఓటింగ్ శాతం ఏంతంటే..?
జార్ఖండ్‌లో రెండో విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 31.37 శాతం పోలింగ్ నమోదైంది.
-
మహారాష్ట్రలో 11 గంటల వరకు ఎంత ఓటింగ్..?
మహారాష్ట్రలో ఓటింగ్ నెమ్మదికాగా సాగుతుంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉదయం 11 గంటల వరకు ఎంత ఓటింగ్ శాతం కేవలం 18.14 శాతం ఓటింగ్ జరిగింది.
-
మంచి మెజారిటీతో గెలుస్తాం: నితిన్ గడ్కరీ
నాగ్‌పూర్‌లో ఓటు వేసిన తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. దేశంలో మహారాష్ట్ర సంపన్న రాష్ట్రం.. ఈ రాష్ట్రం గరిష్టంగా విదేశీ పెట్టుబడులను అందుకుంటుంది. వ్యవసాయ ఎగుమతులు కూడా ఇక్కడ పెరుగుతున్నాయి.. దేశానికే రోల్ మోడల్ గా మహారాష్ట్ర ఉంది.. మంచి ప్రభుత్వం, మంచి నాయకత్వం మహారాష్ట్ర భవిష్యత్తును మార్చగలవు.. ప్రతి ఒక్కరు ఓటు వేసి తమ ప్రజాస్వామిక హక్కులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి.. మహారాష్ట్రలో మంచి మెజారిటీతో బీజేపీ గెలుస్తుంది- నితిన్ గడ్కరీ
-
ఓటు వేసిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్రవీస్..
నాగ్‌పుర్‌లో డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్య అమృత, తల్లి సరితతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
భర్తతో కలిసి ఓటేసిన జెనీలియా..
మహారాష్ట్ర ఎన్నికల్లో లాతూరులో నటి జెనీలియా, ఆమె భర్త నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ తో కలిసి ఓటు వేశారు. ముంబైలో బాలీవుడ్ నటులు కార్తిక్ ఆర్యన్, సోనూసూద్, జాన్ అబ్రహం, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
ఓటేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్..
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన భార్య, కుమారుడితో కలిసి ముంబైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
తక్కువ ఓటింగ్‌పై శరద్ పవార్ రియాక్షన్..
పూణె జిల్లాలోని బారామతి నగరంలో ఓటు వేసిన శరద్ పవార్.. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని అన్నారు. ఇది మహారాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించనుంది. ప్రజలందరూ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.. అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయి.. ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం మంచిది కాదు- శరద్ పవార్
-
పోలీసులు ఓట్లు వేయకుండా ఆపేస్తున్నారు..
మెయిన్‌పురిలోని కర్హల్ అసెంబ్లీ పరిధిలో నంబర్ 17, బూత్ నంబర్ 250లో సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారులను పోలీసులు కొట్టారని ఆరోపణ.. ఓటర్లు ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఎస్పీ.. మొరాదాబాద్‌లోని కుందర్కి అసెంబ్లీలో ఓటర్లను పోలీసులు బెదిరించి ఓట్లు వేయకుండా ఆపేస్తున్నారని వెల్లడి.. ఎన్నికల సంఘం దృష్టి సారించి నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని వినతి.
मुरादाबाद की कुंदरकी विधानसभा में पुलिस द्वारा मतदाताओं को डराया धमकाया जा रहा है और वोट डालने से रोका जा रहा है।
संज्ञान ले चुनाव आयोग, निष्पक्ष मतदान सुनिश्चित हो।@ECISVEEP@ceoup@DMMoradabad pic.twitter.com/cM0kwU6IbJ
— Samajwadi Party (@samajwadiparty) November 20, 2024
-
మీరాపూర్‌లో గందరగోళం..
మీరాపూర్‌లో పోలింగ్ సందర్భంగా జరిగిన గందరగోళం.. కక్రౌలీలో రాళ్లు విసురుకున్న జనం.. అల్లరి మూకలను పోలీసులు తరిమికొట్టారు. భారీ పోలీసు బలగాలతో ఎస్‌ఎస్పీ సంఘటనా స్థలంలోనే ఉన్నారు.
-
ఈసీకి బహిరంగ లేఖ రాసిన బీజేపీ..
ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ లేఖ రాసింది. హిజాబ్ ధరించిన ఓటర్లను గుర్తించాలని.. వారిని గుర్తించిన తర్వాతే ఓటింగ్ జరిగేలా చూడాలని వెల్లడి.. ఈ విషయాన్ని గ్రహించి నిష్పక్షపాతంగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం అని పేర్కొన్న బీజేపీ.
-
అవినీతి రహిత వ్యవస్థ కోసం ఓటు వేయండి: అమిత్ షా
జార్ఖండ్, మహారాష్ట్ర ఓటర్లు అవినీతి రహిత వ్యవస్థ కోసం ఓటు వేయాలి.. యువత బంగారు భవిష్యత్తు కోసం తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.
-
మీ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఓటు వేయండి: రాహుల్ గాంధీ
జార్ఖండ్‌లోని ఓటరు సోదరులు, సోదరీమణులు తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి.. అలాగే, మంచి భవిష్యత్త్ కోసం ఈ రోజు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి..
-
జార్ఖండ్‌లో 9 గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే..?
జార్ఖండ్‌లో ఉదయం 9 గంటల వరకు 12.71 శాతం ఓటింగ్.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
-
ఉప ఎన్నికల స్థానాల్లో 9 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ అంటే.. ?
కుందర్కి- 13.59 శాతం
మీరాపూర్- 13.01 శాతం
పాలక్కాడ్- 12.63 శాతం
కతేహరి- 11.48 శాతం
మంజ్వా - 10.55 శాతం
బాగా- 9.03 శాతం
కర్హల్ - 9.67 శాతం
ఫుల్పూర్- 8.83 శాతం
సిసమావు - 5.73 శాతం
ఘజియాబాద్ - 5.36 శాతం
కేదార్‌నాథ్-4.30 శాతం
-
మహారాష్ట్రలో 9 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే..?
మహారాష్ట్రలో ఉదయం 9 గంటల వరకు 6.61 శాతం ఓటింగ్ నమోదు అయింది. పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న ఓటర్లు
-
సుప్రీంకోర్టుకు ఎస్పీ చీప్ అఖిలేష్
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఓటరు కార్డులు, ఆధార్ ఐడీలను తనిఖీ చేస్తున్న పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని పిటిషన్. ఆధార్ గుర్తింపు కార్డు లేదా గుర్తింపు కార్డును తనిఖీ చేసే హక్కు పోలీసులకు లేదు- అఖిలేస్ యాదవ్
-
పాలక్కాడ్ అసెంబ్లీకి బైపోల్
కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్.. 184 పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్న ప్రజలు..
-
మహారాష్ట్రలో తొలి గంటలో ఓటేసిన ప్రముఖులు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన తొలి గంటలోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న సుప్రియ సూలే..
బారామతిలోని పోలింగ్ కేంద్రంలో ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి ప్రభుత్వం త్వరలో ఏర్పడబోతుందని వెల్లడి
-
ఓటు వేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్
నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు.
-
ఓటేసిన ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్..
బారామతిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
-
ప్రతి ఒక్కరు ఓటేయాలి.. ప్రధాని మోడీ విజ్ఞప్తి
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఓటర్లు.. ముఖ్యంగా మహిళలు, యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు.
-
ఓటు వేయకుండా బీజేపీ అడ్డుకుంటుంది: సమాజ్‌వాది పార్టీ
సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారు.. పురుష ఓటర్లను కొట్టడం, మహిళలను అసభ్య పదజాలంతో దూషించడంతో వారు తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి రచిస్తున్న ప్రజాస్వామ్యంలో చీకటి ఒప్పందం- సమాజ్‌వాది పార్టీ
-
ఓటు వేసిన ఆర్‌బీఐ గవర్నర్
ముంబైలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి.. ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నాం.. ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.
-
ఓటేసిన అక్షయ్ కుమార్..
బాలీవుడు నటుడు అక్షయ్ కుమార్ తన ఓటును వినియోగించుకున్నారు. ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు. ఇక్కడ సీనియర్ సిటిజన్ల కోసం ఏర్పాట్లు చాలా బాగా చేశారు.. అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను- అక్షయ్ కుమార్
#WATCH | Mumbai: Actor Akshay Kumar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024
He says "The arrangements here are very good as I can see that arrangements for senior citizens are very good and cleanliness has been maintained. I want… pic.twitter.com/QXpmDuBKJ7
— ANI (@ANI) November 20, 2024
-
ఓటు హక్కును వినియోగించుకున్న సచిన్..
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను గత కొంతకాలంగా భారత ఎన్నికల సంఘంకి ఐకాన్‌గా ఉన్నాను.. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని మెసేజ్ ఇచ్చారు. ఇది మన బాధ్యత.. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన సచిన్.
-
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత..
జార్ఖండ్, మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రత.. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కఠిన ఆంక్షలు.. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు.
-
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేయనున్న తెలంగాణ ఓటర్లు..
తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిపాబాద్ జిల్లాలోని కెరిమెరి మండలంలోని 12 గ్రామల ప్రజలకు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉంది. పరందోళి, గౌరి, పద్మావతి, ముక్దంగూడ, ఇందిరానగర్, శంకర్ లొద్ది, మహారాజ్ గూడ, అంతాపూర్ ప్రజలకు రాజుగాని నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ఈ గ్రామాల్లో 3 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు.. కాగా, రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న కెరిమెరి మండలం ఎప్పటి నుంచో వివాదంలో ఉంది.
-
జార్ఖండ్ లో కొనసాగుతున్న పోలింగ్..
జార్ఖండ్ లో కొనసాగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్.. 38 నియోజకవర్గాలకు బరిలో 582 మంది అభ్యర్థులు.. 14,218 పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం..
-
జార్ఖండ్‌లోని 38 స్థానాలకు 528 మంది అభ్యర్థులు..
జార్ఖండ్ 38 స్థానాలకు రెండో దశలో ఓటింగ్.. ఎన్నికల బరిలో మొత్తం 528 మంది అభ్యర్థులు.. 472 మంది పురుషులు, 55 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్.
-
5 రాష్ట్రాల్లోని 15 స్థానాలకు బైపోల్
మహారాష్ట్ర, జార్ఖండ్ లతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా నేడు పోలింగ్.. ఈ 15 సీట్లలో 9 ఉత్తరప్రదేశ్‌లో ఉత్తరాఖండ్ నుంచి 1, పంజాబ్ నుంచి 4, కేరళ నుంచి 1 ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతుంది.
-
మహారాష్ట్రలో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య-100186
మహారాష్ట్రలో మొత్తం పోలింగ్ కేంద్రాలు మొత్తం 100186 ఉన్నాయి. అందులో రూరల్ – 57582, అర్బన్- 42604, మోడల్ బూత్‌లు- 633, మహిళలు నిర్వహిస్తున్న బూత్‌లు- 406, వికలాంగులు నిర్వహిస్తున్న బూత్‌లు- 274, వెబ్‌కాస్టింగ్- 67557 ఉన్నాయి
