Maharashtra: మహారాష్ట్ర శంభాజీనగర్‌లో ఓ వ్యక్తి, తనను తాను బాబాగా ప్రకటించుకుని భూతవైద్యం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ప్రజలను కర్రలతో కొట్టడం, బూట్లు నాకమని బలవంతం చేయడం, వైద్యం పేరుతో ‘‘మూత్రం’’తాగించడం వంటి ఘటనలు అధికారుల దృష్టి వచ్చాయి. ఈ అమానవీయమైన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం, బాబాగా చెలమణీ అవుతున్న వ్యక్తి, తన అనుచరులతో కలిసి పరారీలో ఉన్నాడు. ఇతను మహిళల్ని అనుచితంగా తాకినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
Read Also: LAC: 13 వేల అడుగుల ఎత్తులో, చైనాకు చేరువలో.. అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ ప్రారంభానికి సిద్ధం..
వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తిని సంజయ్ రంగనాథ్ పగర్‌గా గుర్తించారు. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువకుడిని బలవంతంగా పైకి ఎత్తి అతడి ముక్కుపై బూటుతో కొడుతున్నట్లు ఉంది. జూలై 17న ఈ వీడియో రికార్డ్ చేయబడినట్లు ఉంది. బాబాగా చెబుతున్న వ్యక్తి, మరొక వ్యక్తిని నేలపై పడుకోబెట్టి, మెడపై కాలుతో తొక్కుతూ బెదిరించడం చూడవచ్చు.
ఈ సంఘటన ఛత్రపతి సంభాజీ నగర్ లోని మూఢనమ్మకాల వ్యతిరేక కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. వారు గ్రామానికి వెళ్లి బాబాను అసలు రంగును బయటపెట్టారు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి బాబా కనిపించకుండా పోయాడు. ఇతడి కోసం పోలీసులు రెండు టీంలుగా వెతుకుతున్నారు.
Viral Video : लग्न होत नाही, मूल होत नाही…भोंदू बाबा तोंडात लघवी करायचा! छत्रपती संभाजीनगरमधील अघोरी प्रकार उघड pic.twitter.com/xrDaYbHOzP
— sandip kapde (@SandipKapde) July 19, 2025