Site icon NTV Telugu

Ajit Pawar: సీఎం ఫడ్నవిస్‌కు మోడీ, అమిత్ షా ఫోన్.. అజిత్ పవార్ మృతిపై ఆరా

Ajit Pawar6

Ajit Pawar6

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం యావత్తు భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక అజిత్ పవార్ మరణ వార్తపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు మోడీ, అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు.

అజిత్ పవార్.. ఈ ఉదయం ముంబై నుంచి బారామతికి విమానంలో బయల్దేరారు. బుధవారం బారామతిలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో పాల్గొనేందుకు వస్తుండగా బారామతి ఎయిర్‌పోర్టులో దిగేందుకు ప్రయత్నిస్తుండగా విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. ఒక్కసారి విమానాశ్రయానికి సమీపంలో ఉదయం 8:45 గంటలకు కూలిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version