Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Maharashtra Cm Uddhav Thackeray Resign

Breaking: పడిపోయిన మహా సర్కార్.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

Published Date :June 29, 2022 , 10:05 pm
By Mahesh Jakki
Breaking: పడిపోయిన మహా సర్కార్.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు ఠాక్రే. ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన ఉద్ధవ్​.. తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫ‌లితంగా రేపు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల ప‌రీక్షే అవ‌స‌రం లేకుండా పోయింది.

ఈ సందర్భంగా.. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్​సీపీ చీఫ్​ శరద్​ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తానన్న ఆయన.. ప్రజాస్వామ్యాన్ని తప్పనిసరిగా పాటిస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం పతనం వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. తమ వాళ్లే.. పరాయి వాళ్లయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహావికాస్‌ అఘాడీకి ప్రత్యర్థుల దిష్టి తగిలిందన్నారు. తమ ప్రభుత్వానికి అదృష్టం కలిసి రాలేదని ఉద్ధవ్ వెల్లడించారు. బాలా సాహెబ్ ఆశయాలను నెరవేర్చామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు. శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన.. సీఎం పదవి కోసం పట్టుబట్టి తెగదెంపులు చేసుకుంది. తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి 2019 నవంబర్ 26న మహావికాస్‌ అఘాడీ కూటమికి ఉద్ధవ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019 నవంబర్ 28న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎన్సీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ కొద్దిరోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తిరిగి ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తదనంతరం పరిణామాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సర్ది చెబుతూ వచ్చారు.

అయితే ఇటీవల శివసేనలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఈనెల 20న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 5 సీట్లు గెల్చుకుంది. నాలుగు సీట్లు గెల్చేందుకు మాత్రమే ఆ పార్టీకి బలం ఉండగా ఐదు సీట్లు దక్కించుకోవడంపై శివసేనలో అంతర్మథనం మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీకి ఓటేసినట్లు గుర్తించారు. ఫలితాలు వచ్చిన వెంటనే శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే అదృశ్యమయ్యారు. తర్వాత శివసేన ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు.ఈ క్రమంలో శివసేనకు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. సుమారు 40 మంది షిండే వర్గంలో చేరిపోయారు. పలువురు స్వతంత్రులు కూడా ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ప్రకటించారు. వారంతా అస్సాంలోని గౌహతిలో మకాం వేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని సందేహంలో పడేశారు. దీంతో మహావికాస్‌ అఘాడీ సర్కారు మైనార్టీలో పడిపోయింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగిరావాలని ఉద్ధవ్ ఠాక్రే కోరినా లాభం లేకపోయింది.
మరోవైపు బీజేపీకి చెందిన సీనియర్ నేత,మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఒక్కసారిగా చక్రం తిప్పారు. మొదట దిల్లీలో భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపిన ఆయన.. రాత్రికి ముంబయి చేరుకొని గవర్నర్‌తో సమావేశమయ్యారు. కొద్దిసేపటికే అసెంబ్లీలో గురువారం బలనిరూపణ చేసుకోవాలంటూ ఉద్ధవ్‌ ఠాక్రేకు గవర్నర్‌ లేఖ రాశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవడం వల్ల… ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఎంవీఏ ప్రభుత్వం దాదాపు 32 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భాజపా నాయకులు సంబరాల్లో మునిగారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • maha politics
  • Maharashtra
  • Maharashtra political crisis
  • uddav thackeray

తాజావార్తలు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

  • Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

  • Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions