Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఏక్‌నాథ్ షిండే సీఎం పదవికి రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతో కలిసి రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రిజైన్ లేటర్ సమర్పించారు. ఇక, కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని మహారాష్ట్ర గవర్నర్ కోరారు. ఇందుకు షిండే ఒప్పుకున్నారు. కాగా, ఈ నెల 23న వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.
Read Also: Bajrang Punia Banned: చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. నాలుగేళ్ల నిషేధం
అయితే, దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ నాయకులూ డిమాండ్ చేస్తుండగా మరోసారి ఏక్‌నాథ్ షిండేకే అవకాశం ఇవ్వాలని.. బిహార్ మోడల్ అమలు చేయాలని శివసేన (షిండే) వర్గం నేతలు కోరుతున్నారు. ఇక, ఈ సస్పెన్స్ ఈరోజు (బుధవారం) ఉదయం వీడే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు భేటీ అవుతారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
Read Also: RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన
ఇక, ఈ ముగ్గురు నాయకులే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది తేలుస్తారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఎవరనేది తేల్చడంపై తొందరపడబోమని భారతీయ జనతా పార్టీ నేత ఒకరు చెప్పారు. కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై మిత్రపక్షాల్లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు లేకుండా అన్ని నిర్ణయాలు పూర్తి చేసుకుంటామన్నారు. అలాగే, ఫడ్నవీస్‌కే సీఎంగా ఛాన్స్ ఇవ్వాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో పాటు ఏక్‌నాథ్ షిండేకు ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించాలని సూచించారు.