Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- సీజేపీ నిరసనలపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- నిరసనల్లో పాల్గొనే జెన్-జీపై మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్..
- దేశాన్ని విభజించే యువత వద్దని, దేశాన్ని ఏకం చేసే వారు కావాలని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahant Rajudas: అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్‌గఢి ఆలయ మహంత్ రాజూదాస్ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనలపై తీవ్రంగా స్పందించారు. నిరసనల్లో పాల్గొంటున్న జెన్-జీపై ప్రధాని నరేంద్రమోడీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ నిరసన తెలుపుతోంది. దీనిపై రాజూదాస్ మాట్లాడుతూ.. జెన్-జీ యువత దేశాన్ని ఏకం చేయాలి, కానీ విభభించేది కాదని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలని భావించే యువతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తామంతా ప్రధాని మోడీ వెంటే ఉంటామని అన్నారు. భారతదేశం ముక్కలవుతుందని నినాదాలు చేసే జెన్-జీ దేశద్రోహులు, మతద్రోహులు అవుతారని, దేశాన్ని ఏకం చేసే యువత మనకు కావాలని అన్నారు.
హిందూ జాతి, రామరాజ్యం గురించి మాట్లాడుతూ.. రామరాజ్యంలో పరస్పర సంప్రదింపులు ఉంటాయని, వివాదాలు ఉండవని, అందరూ కలిసి జీవిస్తారని, కలిసి అభివృద్ధి చెందుతారని అన్నారు. దేశంలో నివసిస్తున్న ప్రతీ పౌరుడు జాతీయవాదిగా ఉండాలని అన్నారు. మతం ఆధారంగా దేశాన్ని ముస్లింలు విభజించారని అన్నారు. ముస్లింలు ఇప్పటికే (పాకిస్తాన్) వారి దేశాన్ని తీసుకున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, బెయిల్‌పై విడుదలైన సీజేపీ నేతలు ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ ఉందని, ప్రభుత్వ యంత్రాంగం సొంత ప్రజలకు ఎదురుతిరుగుతోందని అన్నారు. పోలీసులు తమకు ఎలాంటి అధికారిక నోటీసు ఇవ్వకుండా నిర్బంధించారని, తమ మొబైల్ ఫోన్లు లాక్కుని, తమ న్యాయవాదుల్ని కలిసే అవకాశం ఇవ్వలేదని సీజేపీ నేత సౌరవ్ దాస్ ఆరోపించారు.
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..