Madras High Court: దేవుడి ముందు అందరూ సమానమే.. VIP దర్శనాలు ఎందుకు?
- దేవుడి ముందు అందరూ సమానమే: మద్రాస్ హైకోర్టు
- VIP దర్శనాలపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు
- “దేవుడు VIPల కోసం ఎదురుచూడాలా?” అంటూ ప్రశ్న
- మంత్రులు, ఎమ్మెల్యేల ప్రత్యేక దర్శనాలపై అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court: ఆలయాల్లో కొనసాగుతున్న VIP దర్శనాలపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమే అని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా దేవాలయాల్లోకి వెళ్లి ప్రత్యేక దర్శనాలు చేయించుకోవడం మంచిది కాదని కోర్టు స్పష్టం చేసింది. VIPల కోసం దేవుడు ఎదురుచూస్తూ ఉండాలా.? అని ఘాటుగా ప్రశ్నించింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టులో ఈ అంశంపై విశ్వ హిందూ పరిషత్ ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి. చొక్కలింగం దాఖలు చేశారు. ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. అయితే వృద్ధులు, వికలాంగులు, గర్భిణిలు, కొత్తగా వివాహం జరిగిన జంటలకు, రాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధ హోదా కలిగిన వారికి మినహాయింపు ఇవ్వవచ్చని పిటిషన్లో పేర్కొన్నారు.
Also Read
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
మే 15న తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఒక మంత్రి దర్శనం కోసం ఆలయ సమయాన్ని పొడగించారనే ఆరోపణలపై కోర్టు గతంలో వివరణ కోరింది. అయితే ఆలయ సమయాన్ని పొడగించలేదని తమిళనాడు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. పూర్తిగా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరగా, కోర్టు 6 వారాల సమయం ఇచ్చింది.
ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఆలయంలోకి వెళ్లవచ్చని, దేవుడు వారి కోసం ఎదురుచూస్తాడని భావించకూడదని, వీఐపీ దర్శనాలు ఎందుకు కావాలి? దేవుడు అందరికి సమానమే కదా అని వ్యాఖ్యానించింది.సనాతన ధర్మం ధనికుడు, పేదవాడు అనే భేదాన్ని చూపడదని, అందర్ని సమానంగా చూస్తుందని, అదనపు డబ్బు తీసుకుని ప్రత్యేక దర్శనాలు కల్పించడం హిందూ శాస్త్రాల్లో ఎక్కడా లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది భక్తుల నుంచి డబ్బులు దోచుకోవడమే అని ఆరోపించారు. ద్రావిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వీఐపీ కల్చర్ పెరిగిందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19,21,25లకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు.
తాజావార్తలు
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!