TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
- మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
- టీవీకే పార్టీకి కోలుకోలేని దెబ్బ
- శ్రీనివాస సేతుపతిపై సంచలన ఆంక్షలు
- సేతుపతి విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీలో బలాబలాల పరీక్షకు ముందే టీవీకే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తిరుపత్తూరు నియోజకవర్గ ఫలితంపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. గెలిచిన అభ్యర్థి శ్రీనివాస సేతుపతిపై సంచలన ఆంక్షలు విధించింది. మే 13లోగా సభలో జరిగే విశ్వాస పరీక్షలో ఆయన పాల్గొనకుండా స్టే ఇస్తూ వేసవి విరామ కాల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చేతిలో డీఎంకే సీనియర్ నేత పెరియకరుప్పన్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి వెనుక అధికారుల ఘోర తప్పిదం ఉందని ఆయన కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులో తిరుపత్తూరు పేరుతో రెండు నియోజకవర్గాలు ఉండటమే ఈ వివాదానికి మూలమైంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు ఓట్లను, పొరపాటున తిరుపత్తూరు జిల్లాలోని కౌంటింగ్ కేంద్రానికి పంపారని ఆయన తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో జరిగిన ఈ పొరపాటు వల్లే తాను ఓడిపోయానని పెరియకరుప్పన్ సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
కేవలం ఒక్క ఓటుతోనే గెలుపోటములు నిర్ణయించబడినప్పుడు ఇటువంటి గందరగోళం అభ్యర్థి హక్కులను దెబ్బతీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరి, జస్టిస్ ఎన్. సెంథిల్ కుమార్ల ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు టీవీకే ఎమ్మెల్యే సభలో ఓటు వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బుధవారం జరిగే విశ్వాస పరీక్షలో టీవీకే పార్టీ ఒక ఓటును కోల్పోవడం ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఒక్క ఓటు తేడాతో గెలిచిన ఎమ్మెల్యేకు, ఇప్పుడు ఆ ఒక్క ఓటు వివాదమే శాపంగా మారింది. ఆదివారం నాడు కోర్టు ప్రత్యేకంగా సమావేశమై ఈ తీర్పు ఇవ్వడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!