NTV Telugu Site icon

High Court: అత్యాచార బాధితురాలు 8 నెలల ప్రెగ్నెన్సీ తొలగించుకునేందు కోర్టు అనుమతి..

Madhya Pradesh

Madhya Pradesh

High Court: టీనేజ్‌లో అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాధితురాలకి కోర్టు ఉపశమనం కలిగించింది. అత్యాచారా బాధితురాలు తన 8 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణపై వెనక్కి తగ్గబోమని, దీనిపై అఫిడవిట్ సమర్పించాలని బాధితురాలి తండ్రిని కోర్టు ఆదేశించింది. తన గర్భాన్ని రద్దు చేయాలంటూ మైనర్ సర్వైవర్ చేసిన పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది.

సాగర్ జిల్లా మెజిస్ట్రేట్(సీజేఎం) ముందు అఫిడవిట్ దాఖలు చేయాలని బాధితురాలి తండ్రిని ఆదేశించింది. నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని, దీంతో తన గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ని జస్టిస్ జిఎస్ అహ్లువాలియా ధర్మాసనం విచారించింది.

Read Also: PM Modi: టాప్-3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంటుంది.. ఇదే నా హామీ..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో నిందితుడు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. దీనిపై గతేడాది అక్టోబర్ 23న కేసు నమోదైంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో, అత్యాచార చట్టాలు, ఎస్సీ/ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.

అయితే అత్యాచార బాధితురాలు గర్భం తీయించుకునేందుకు వైద్యపరంగా రద్దును కోరినందున, వారు ఈ కేసులో దూరంగా ఉండమని పిటిషనర్‌తో పాటు ఆమె తండ్రి కూడా విచారణ అధికారికి అఫిడవిట్ సమర్పించాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ బాధితురాలు దీనికి విరుద్ధంగా తనపై నిందితుడు అత్యాచారం చేయలేనది, తనను తాను మేజర్ అని చెప్పుకున్నట్లైతే ట్రయల్ కోర్టు తన నివేదికను ప్రాసిక్యూట్రిక్స్ యొక్క డిపాజిషన్ షీట్‌తో పాటు ఈ కోర్టు రిజిస్ట్రార్ జనరల్ ముందు సమర్పించాలని ఆదేశిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.