Headmaster Assaults: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోని జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించిన వీడియో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభుత్వం వెంటనే అతడిపై చర్యలు తీసుకుంది. అయితే, ఈ ఆగస్టు 26వ తేదీన కుంభకోణంలోని అర్జుని గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక, ఆరేళ్ల బాలుడు రవి భాళవి నోరు గట్టిగా మూసి, బలవంతంగా నేలపైన ఉన్న హెడ్ మాస్టర్ మహేష్ చౌదరి పడుకోబెట్టి.. అతని వెన్నెముకపై కర్ర పెట్టి గట్టిగా నొక్కడంతో ఆ బాలుడి వీపుపై తీవ్ర గాయమైంది. అలాగే, మరో వైపు ఇంకో చిన్నారిని కూడా సదరు ప్రిన్సిపాల్ చితకబాదుతుండటం కనిపిస్తుంది.
Read Also: Hamas-Israel: అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి వీడియోను విడుదల చేసిన నెతన్యాహు.. ఎందుకోసమంటే..!
అయితే, తమ పిల్లలపై ఉపాధ్యాయుడు తరచుగా దాడి చేసినట్లు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోలేదు. కానీ, ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడు రాకేష్ సనోడియా పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేయగా.. హెడ్ మాస్టర్ మహేష్ చౌదరి విద్యార్థులను కొట్టడం చూశారు. సదరు టీచర్ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల కుటుంబాలు డిమాండ్ చేశాయి.
Read Also: Ghati : సెన్సార్ ముగించుకున్న ‘ఘాటి’.. ఇంటర్వెల్ తర్వాత ఊచకోతేనా! .
మరోవైపు, వైరల్ అయిన వీడియోను గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆరోగ్య శాఖ అసిస్టెంట్ కమిషనర్ అమర్ సింగ్ ఉయికే మహేష్ చౌదరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అతన్ని ఘన్సోర్ బ్లాక్ ఆఫీసర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే, హెడ్ మాస్టర్ పై బాధితుడైన రవి తండ్రి విజయ్ భాళవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 296, 115(2)తో పాటు ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీస్ నిరోధక) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. గాయపడిన బాలుడికి చికిత్స కొనసాగుతుంది.