మధ్య ప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ బ్లెడ్ ప్రెషర్ చెక్ చేస్తుండగా మిషన్ లోని బ్యాటరీ పనిచేయకలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ లోపానికి సంబంధించి ఆరోగ్యశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌లోని జివాజీ విశ్వవిద్యాలయంలో ఒక స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. భోపాల్ నుండి హాజరైన మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ మురార్ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. ఉదయం, వైద్యుల బృందం ఆయన హెల్త్ చెకప్ కోసం వచ్చారు. ఆయన రక్తపోటును చెక్ చేస్తున్నప్పుడు.. బీపీ చెక్ చేసే మిషన్ సరిగా పని చేయలేదు. పదే పదే ప్రయత్నించినప్పటికీ మిషన్ పనిచేయక పోయే సరికి .. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.
బ్లడ్ ప్రెజర్ మెషిన్ లోని బ్యాటరీ ఫెయిల్ అయిందని డిస్ట్రిక్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సచిన్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే, వైద్యులు వెంటనే బ్యాటరీని మార్చి గవర్నర్ బ్లడ్ ప్రెజర్ ను కొలిచారు. అయితే, ఈ విషయంలో సివిల్ సర్జన్ కు నోటీసు జారీ చేశారు ఆరోగ్య శాఖ అధికారులు.