Site icon NTV Telugu

Kangana Ranaut: మేడం కొంచెం చూసి మాట్లాడండి.. బీజేపీ ఎంపీకి విద్యుత్ శాఖ కౌంటర్

Kangana

Kangana

Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్‌ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందంటూ అరిచి గోల చేసింది. ఇంత మొత్తం బిల్లు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు అని ఆరోపించింది. మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ. లక్ష కరెంట్‌ బిల్లు వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండలేదు.. దీంతో ఆ బిల్లు చూసి ఒక్కసారిగా షాకయ్యాను అని చెప్పుకొచ్చింది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కంగనా రనౌత్ విరుచుకుపడింది.

Read Also: Hanmakonda: చెరువులో దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

ఇక, రంగంలోని దిగిన విద్యుత్‌ శాఖ అధికారులు.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇంటికి పంపిన కరెంట్ బిల్లుపై ఆరా తీశారు. ఎంపీ కంగనా ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ రియాక్ట్ అయ్యారు. మండి ఎంపీ ఇంటికి వచ్చిన బిల్లు లక్ష రూపాయలు కాదని రూ.55 వేలు మాత్రమే.. గతంలో చెల్లించని బిల్లుల కారణంగా మొత్తం రూ.91,100 బిల్లు వచ్చిందన్నారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ ను ఉపయోగించింది.. అందుకే ఒక్క నెల బిల్లు రూ.55 వేలు వచ్చిందని అన్ని లెక్కలతో సహా మీడియాకు చూపించారు. అలాగే, తాము బీజేపీ ఎంపీకి రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు.

Read Also: Hyderabad: నగరంలో మరో హిట్ అండ్ రన్.. బైకును ఢీ కొట్టిన కారు.. యువతి మృతి

అలాగే, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ మాట్లాడుతూ.. మేడమ్‌ కరెంట్‌ బిల్లులు చెల్లించరు.. అంతటితో ఆగకుండా మా ప్రభుత్వాన్నే నిందిస్తారు అంటూ చురకలు అంటించారు. ప్రజా వేదికలపై అరిచి గోల చేస్తారు.. ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక ఆరోపణలు చేస్తారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చూసి బిల్లును చూడండి మేడం కంగనా అంటూ మంత్రి విక్రమాదిత్య పేర్కొన్నారు.

Exit mobile version