ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఉద్యోగం రాలేదని.. చదువులో వెనకపడుతున్నామని, మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హన్మకొండలో చోటుచేసుకుంది. ఎన్ఐటిలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న హృతిక్ సాయి అనే విద్యార్థి వడ్డెపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read:Hyderabad: నగరంలో మరో హిట్ అండ్ రన్.. బైకును ఢీ కొట్టిన కారు.. యువతి మృతి
మార్కులు తక్కువగా వస్తున్నాయన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు మరేమైన ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కొడుకు ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.