Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- లక్నోలో దారుణం..
- భార్యను మోసం చేసిందంటూ ఆరోపణ వాట్సాప్ స్టేటస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow Crime: లక్నోలోని గోమతీనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కాల్చి చంపిన అనంతరం ఆమెను హత్య చేసిన విషయాన్ని మొబైల్ స్టేటస్‌లో పెట్టిన ఓ వ్యక్తి.. ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న తన సోదరిని కాల్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. మానస్ బాజ్‌పాయ్ ఎస్బీఐలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి తన భార్య దివ్య మిశ్రాతో కొంతకాలంగా కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ దంపతులు దాదాపు ఏడాది కాలంగా విడిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ వివాదానికి సంబంధించి ఫ్యామిలీ కోర్టులో కేసు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం దివ్య తన విధుల్లో భాగంగా గోమతీనగర్‌లోని ఓ బ్యాంకుకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న మానస్.. బ్యాంకు బయట ఆమెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో దివ్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మానస్ అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లి తన మొబైల్లో ఓ స్టేటస్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అందులో తన భార్య తనను మోసం చేస్తోందనే ఆరోపణతోనే ఆమెను హత్య చేసినట్లు పేర్కొన్నాడు. అనంతరం తన సోదరిని చంపి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన వాట్సాప్ స్టేటస్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే కొందరి పేర్లను ప్రస్తావిస్తూ వారికి ఈ విషయాల గురించి తెలుసని పేర్కొన్నట్లు సమాచారం.
స్టేటస్ చూసిన పొరుగువారికి అనుమానం వచ్చింది. మానస్‌కు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో వారు ఇంటికి వెళ్లారు. తలుపు తట్టినా ఎలాంటి స్పందన రాకపోవడంతో కొందరు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ మానస్, అతడి సోదరి సీమ మృతదేహాలు కనిపించాయి. ఇంట్లో టీవీ ఆన్‌లో ఉండటంతో పాటు హనుమాన్ చాలీసా ప్లే అవుతున్నట్లు చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. మానస్‌కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.అయితే ఈ అంశంపై పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. మానస్ తల్లిదండ్రులు ఇప్పటికే మృతి చెందారని, అనారోగ్యంతో ఉన్న సోదరి సీమ అతడితో కలిసి ఉంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. భార్య హత్యను ముందుగానే పథకం ప్రకారం చేశాడా? కుటుంబ వివాదమే కారణమా? మానస్ స్టేటస్‌లో చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనే కోణాల్లో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
Also Read
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
- Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
తాజావార్తలు
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
-
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!