కొత్త ఎల్ పీజీ సిలిండర్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీలు 19 కిలోల కమెర్షియల్ సిలిండర్లపై ధరలను తగ్గించింది. ప్రస్తుతం తగ్గించిన సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Read Also: Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నేడే వర్చువల్ క్యూ బుకింగ్స్ ఓపెన్..
నవంబర్ 1, 2025 నుండి తగ్గించిన సిలిండర్ల ధరలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్ పీజీ సిలిండర్ యొక్క సవరించిన ధర 1,590.50 కంటే ఐదు రూపాయలు గరిష్టంగా పెరిగింది. అయితే ఢిల్లీలో ప్రస్తుత వాణిజ్య గ్యాస్ 1,595.50కు చేరింది.. అయితే వంట గ్యాస్ ధరలలో ఎలాంటి మార్పులేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Read Also:POCSO Act: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి… 20ఏళ్ల జైలు శిక్ష
కమెర్షియల్ సిలిండర్ల ధరను అక్టోబర్ లో 15 రూపాయలు పెంచారు. అయితే ప్రస్తుతం ఈ ధరలో మార్పు చేసి ఐదు రూపాయలు తగ్గించారు. తగ్గించిన ఈ ధరలు నవంబర్ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఎల్ పీజీ కొత్త ధర ముంబైలో 1,542, కోల్‌కతాలో 1,694 , చెన్నైలో 1,750 గా ఉంది. కమెర్షియల్ సిలిండర్లను హోటళ్ళు, రెస్టారెంట్లు, ధాబాలు, ఇతర వాణిజ్య సంస్థలలో ఉపయోగిస్తారు. IOCL వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు 19 కిలోల సిలిండర్ పాట్నాలో రూ.1876కి, నోయిడాలో రూ.1876కి, లక్నోలో రూ.1876కి, భోపాల్‌లో రూ.1853.5కి గురుగ్రామ్‌లో రూ.1607కి అందుబాటులో ఉంది. కానీ ఇంటిలో వాడుకునే గ్యాస్ ధరలు తగ్గకపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు జనాలు.