Girl Marriage with Lord Krishna: శ్రీకృష్ణ భగవానుడికే ఇచ్చి కుమార్తె పెళ్లి చేసిన వ్యాపారవేత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వ్యాపారవేత్త తన కుమార్తెకు శ్రీకృష్ణుడితో కోలాహలంగా వివాహం జరిపించాడు.. ఈ తంతుకు బంధుమిత్రులను అందరినీ పిలిచి గ్రాండ్గా పెళ్లి చేశారు.. అదేంటి..? కూతురికి శ్రీకృష్ణ భగవానుడితో వివాహం జరిపించడం ఏంటి? అనే ఆశ్చర్యపోకండి… విషయం ఏంటంటే.. అనారోగ్యంతో మంచం పట్టిన తన కుమార్తె కోరికను తీర్చడానికి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శ్రీకృష్ణుడితో పెళ్లి చేశాడు ఆ తండ్రి.. భగవంతుడితో కూతురుకు పెళ్లికి ఎలా జరిపించారనే వివరాల్లోకి వెళ్తే.. శివపాల్ అనే వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన 26 ఏళ్ల కుమార్తె ఉంది.. ఆమె మాట్లాడలేదు, ఏమీ వినలేదు కూడా.. 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తెను శివపాల్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ వస్తున్నాడు.. అయితే, తన కుమార్తెకు వివాహం జరగడం కష్టమని భావించిన ఆయన.. తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేయాలని భావించి.. తన ఆలోచనను అమలు చేశాడు..
Read Also: Stolen in Police Station: పోలీస్ స్టేషన్లోనే దొంగతనం.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాకే..!
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
ఇందుకోసం ఓ అమ్మాయికి కృష్ణుడి వేషం కట్టించారు.. ఇక, ఏర్పాట్లలో ఎక్కడా తగ్గేదేలే అనే తరహాలో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు.. బృందావనం నుండి భారీ ఊరేగింపుగా.. బారాత్ బ్యాండ్ మరియు డీజే, లైట్ల వెలుగుల్లో నృత్యాలు చేస్తూ వధువు ఇంటికి కృష్ణయ్య చేరుకున్నారు.. ఆ తర్వాత వివాహాన్ని జరిపించారు.. మొత్తంగా.. నడవలేని నరాల సంబంధిత రుగ్మతతో బాధపడుతోన్న తన కుమార్తెను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోవడం.. ఎన్నో ఆస్పత్రులు తిరిగినా.. తన కుమార్తెకు నయం కాకపోవడం.. తన వయసులో ఉన్న అందరు ఆడపిల్లల్లాగే ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో.. తండ్రి ఆమెను శ్రీకృష్ణ భగవానుడికే అప్పగించాలని నిర్ణయానికి వచ్చి ఇలా పెళ్లి జరిపించాడు.. తన కూతురు కోరికను కూడా తీర్చినవాడయ్యారు.. మొత్తంగా ఈ వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..
Man fulfills terminally sick daughter’s wish, marries her to #LordKrishna in #Gwalior with fanfare. During the #marriage all #rituals were followed, watchhttps://t.co/SIICIKukNr#MadhyaPradesh #Viral #News #Krishna pic.twitter.com/cl4CqPfaax
— Free Press Journal (@fpjindia) November 10, 2022
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..