Tamil Nadu Floods: తమిళనాడులో హృదయవిదారక ఘటనలు.. ఇళ్ల ముందే శవాలను కాల్చుతున్న వైనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Floods: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. వర్షాలు తగ్గినప్పటికీ, ప్రజల్ని కష్టాలు వీడటం లేదు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు గత వారం కురిసిన వర్షాలకు చాలా ప్రభావితమైంది. తూత్తుకూడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల ధాటికి కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.
వరదల వల్ల శ్మశాన వాటికలు మునిగిపోవడంతో అక్కడి ప్రజలు శవాలను ఇళ్ల ముందే కాల్చే దుస్థితి ఏర్పడింది. చనిపోయిన వారికి ఇంటి ముందే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. దీని కోసం మొబైల్ శ్మశానవాటికను ఉపయోగిస్తు్న్నారు. ఎల్పీజీ సిలిండర్లు వాడి శవాలను దహనం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షం కారణంగా వివిధ కులాలకు చెందిన వారికి కేటాయించిన 12 శ్మశాన వాటికలు నిరుపయోగంగా మారడంతో అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.
Also Read
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
Read Also: Ram Charan: బ్రేకింగ్.. సీఎంను కలిసిన రామ్ చరణ్ దంపతులు
శ్మశాన వాటికలు ఇప్పటికీ రెండు అడుగుల నీటిలో మునిగి ఉన్నాయని తూత్తుకుడి కార్పొరేషన్ నివాసి గణేశన్ తెలిపారు. కొంతమంది తమవారి మృతదేహాలను దహన సంస్కారాల కోసం సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. చాలా మంది ప్రజలు మృతదేహాలను ఖననం చేయడానికి తిరువణ్ణామలై లేదా కోవిల్‌పట్టికి తరలిస్తున్నారని అన్నారు. నీరు పూర్తిగా తగ్గినప్పటికీ.. మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు అనువుగా ఉండాలంటే మరో 5 నెలలు పడుతుందని గణేశన్ పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల కారణంగా స్థానికులు రెండు ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగించి తాత్కాలిక శ్మశానవాటికను ఏర్పాటు చేశారు. క్రైస్తవులు తమ బందువుల మృతదేహాలను వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. హిందువులు దహనసంస్కారాల కోసం మొబైల్ శ్మశాన వాటికను ఉపయోగిస్తున్నారు. తూత్తుకుడితో పాటు తిరునెల్వేలి జిల్లాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల్ని ఎదుర్కొన్నాయి.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!