NTV Telugu Site icon

Viral News: ‘‘గూగుల్ ఈజ్ రాంగ్’’.. ప్రయాణికుల్ని హెచ్చరించేందుకు సైన్‌బోర్డ్..

Google Maps

Google Maps

Viral News: ఇటీవల కాలంలో అడ్రస్ కనుక్కోవడం చాలా సులభంగా మారింది. గూగుల్ మ్యాప్స్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయంలో సరైన మార్గాలను ఎంచుకోవడం సులభంగా మారింది. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో మాత్రం గూగుల్ తల్లిని నమ్ముకుని వెళ్తే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కొల్పోయిన వాళ్లు ఉన్నారు. మరికొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్తే, చివరకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడేయడం మనం చూస్తున్నాం.

గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ ఎప్పుడూ మిస్ కానప్పటికీ.. ఇది ఎల్లప్పుడు ఖచ్చితమైనందని కాదు. కొన్ని సార్లు తప్పుడు గమ్యస్థానాలను తీసుకెళ్లడం చూస్తున్నాం. ఇదిలా ప్రస్తుతం ఓ సైన్‌బోర్డు తెగ వైరల్ అవుతోంది. స్థానిక ప్రజలు ప్రయాణికుల రక్షణ కోసం గూగుల్‌ని ఉద్దేశించి ఈ బోర్డును ఏర్పాటు చేశారు. గూగుల్ నావిగేషన్ పొరపాటు గురించి ప్రయాణికులను హెచ్చరించేందుకు ఓ బోర్డును ఏర్పాటు చేశారు.

Read Also: Imran Khan: ‘‘పాకిస్తాన్‌లో ఈవీఎంలు ఉంటే’’.. ఎన్నికలపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు..

కొడగు కనెక్ట్ ఎక్స్ హ్యాండిల్ ఈ సైన్ బోర్డు చిత్రాన్ని పంచుకుంది. ‘‘గూగుల్ ఈస్ రాంగ్. ఈ రహదారి క్లబ్ మహీంద్రాకు వెళ్లదు’’ అని రాసి ఉన్న సైన్‌బోర్డు ఫోటోను ట్వీట్ చేసింది. ఇది ఒక్కసారిగా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా ట్వీట్స్ చేస్తున్నారు. ‘‘ ఇండియా ఈస్ నాట్ బిగినర్స్’’అని, మరొకరు ‘‘హాహహ గూగుల్ ఆంటీ ఈ రోజుల్లో చాలా తప్పుగా ఉంది’’ అని కామెంట్స్ చేశారు. కొంతమంది తమ సొంత అనుభవాలను కూడా పంచుకున్నారు. ఎల్లప్పుడూ గూగుల్ మ్యాప్స్ సరికావని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. కుక్కే సుబ్రమణ్య నుంచి మడికేరికి వెళ్తున్న సమయంలో గూగుల్ మ్యాప్స్ ద్వారా 80 కి.మీ ఎక్కువగా ప్రయాణించి, చివరకు స్థానిక వ్యక్తి ద్వారా సరైన మార్గాన్ని పొందామని ఓ నెటిజన్ తన సొంత అనుభవాన్ని తెలిపారు.