Lightning Strike: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు.. 10 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning Strike In Uttar pradesh, Madhya pradesh: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటులో పలువురు మరణించారు. మధ్యప్రదేశ్ లోని విదిశా, సత్నా, గుణ జిల్లాల్లో గత 24 గంటల్లో 9 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని గంజ్ బాసోడా తహసీల్ పరిధిలోని అగసోడ్ గ్రామంలో వర్షం వస్తుందని చెట్టుకింద నిల్చున్న నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. దీంతో వారంతా అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిని గాలు మాలవ్య, రాము, గుడ్డా, ప్రభులాల్ గా గుర్తించారు. మరణించిన వారంతా 30 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులే. సత్నాలో పోడీ పటౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం చోటు చేసుకున్న పిడుగు పాటు ఘటనల్లో నలుగురు చనిపోగా.. ఒకరు గాయపడ్డారు. మరణించిన వారిని అంజన, చంద్ర, రాజ్ కుమార్, రాజ్ కుమార్ యాదవ్ గా గుర్తించారు. ఇక గుణ జిల్లాలో భోరా గ్రామంలో పిడుగు పడి 45 ఏళ్ల మహిళ మరణించింది.
Read Also: SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ-డీ1 విఫలం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో
Also Read
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లో పిడుగు పడి మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా మరణించారు. పిడుగు పడటం వల్ల ఇంటి పై కప్పు కూలి అంగూరి దేవీ( 55), ఆమె కుమారుడు మున్నా(30) మరణించారు. పిడుగుపాటు వల్ల రాష్ట్రంలో కలిగిన నష్టాలను అధికారులు అంచాన వేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మధ్యప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో కూడాన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తేమ వాతావరణ ఏర్పడిందని.. ఇది వర్షాకలకు కారణం అవుతుందని.. దీంతో పాటు రుతుపవణాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
తాజావార్తలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!