NTV Telugu Site icon

Lightning Strike: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు.. 10 మందికి పైగా మృతి

Lightning Strike

Lightning Strike

Lightning Strike In Uttar pradesh, Madhya pradesh: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటులో పలువురు మరణించారు. మధ్యప్రదేశ్ లోని విదిశా, సత్నా, గుణ జిల్లాల్లో గత 24 గంటల్లో 9 మంది మరణించారు.  మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని గంజ్ బాసోడా తహసీల్ పరిధిలోని అగసోడ్ గ్రామంలో వర్షం వస్తుందని చెట్టుకింద నిల్చున్న నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. దీంతో వారంతా అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిని గాలు మాలవ్య, రాము, గుడ్డా, ప్రభులాల్ గా గుర్తించారు. మరణించిన వారంతా 30 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులే. సత్నాలో పోడీ పటౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం చోటు చేసుకున్న పిడుగు పాటు ఘటనల్లో నలుగురు చనిపోగా.. ఒకరు గాయపడ్డారు.  మరణించిన వారిని అంజన, చంద్ర, రాజ్ కుమార్, రాజ్ కుమార్ యాదవ్ గా గుర్తించారు. ఇక గుణ జిల్లాలో భోరా గ్రామంలో పిడుగు పడి 45 ఏళ్ల మహిళ మరణించింది.

Read Also: SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ-డీ1 విఫలం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో

ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లో పిడుగు పడి మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా మరణించారు. పిడుగు పడటం వల్ల ఇంటి పై కప్పు కూలి అంగూరి దేవీ( 55), ఆమె కుమారుడు మున్నా(30)  మరణించారు.  పిడుగుపాటు వల్ల రాష్ట్రంలో కలిగిన నష్టాలను అధికారులు అంచాన వేస్తున్నారు.  ప్రకృతి వైపరిత్యాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మధ్యప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో  కూడాన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తేమ వాతావరణ ఏర్పడిందని.. ఇది వర్షాకలకు కారణం అవుతుందని.. దీంతో పాటు రుతుపవణాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.