Site icon NTV Telugu

Pahalgam Terror Attack: భారత వ్యతిరేక ర్యాలీలో పహల్గామ్ సూత్రధారి.. వీడియో వైరల్..

Pak Terrorist

Pak Terrorist

Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామం అని మరో ఘటన రుజువు చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను ముష్కరులు బలి తీసుకున్నారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్నాడు. భారత వ్యతిరేఖ ర్యాలీలో ఉగ్రవాది సైఫుల్లా పాల్గొన్నాడు. బుధవారం పాకిస్తాన్‌లో జరిగిన ర్యాలీలో పాక్ రాజకీయ నాయకులు, ఉగ్రవాదులు ఒకే వేదికను పంచుకున్నారు.

పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సవమైన యూమ్-ఎ-తక్బీర్‌ను పురస్కరించుకుని పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) నిర్వహించిన ర్యాలీలో రెచ్చగొట్టే ప్రసంగాలు, భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సమావేశానికి ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాది తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. “పహల్గామ్ ఉగ్రవాద దాడికి నన్ను సూత్రధారిగా నిందించారు, ఇప్పుడు నా పేరు మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది” అని పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్‌లో జరిగిన ర్యాలీలో కసూరి అన్నారు.

Read Also: Ananthapuram: మారువేషంలో అనంతపురం జిల్లా కలెక్టర్.. గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు

ప్రజల్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన సైఫుల్లా కసూరి.. అల్లాహాబాద్ సెంటర్‌లో ‘‘ముదస్సిర్ షహీద్’’పేరుతో ఒక ఆస్పత్రిని నిర్మించబతోన్నట్లు ప్రకటించాడు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో హతమైన అనేక మంత్రి హై ప్రొఫైల్ ఉగ్రవాదుల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్, జిహాదీ నినాదాలతో పాటు “నారా-ఎ-తక్బీర్”తో నిండిన ఆవేశపూరిత ప్రసంగం చేశారు.

పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) పార్టీని లష్కరే తోయిబాకు సంబంధించిన రాజకీయ పార్టీ. పాకిస్తాన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్‌లోని NA-122 స్థానం నుండి పార్లమెంటుకు పోటీ చేసిన సయీద్, ఎన్నికల్లో ఓడిపోయాడు. 2008 ముంబై దాడులకు సూత్రధారిగా ఉన్న హఫీస్ సయీద్ ఈ పార్టీ తెరవెనక కార్యకలాపాల్లో ఉన్నాడు.

Exit mobile version