Kerala: కేరళ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్(యూడీఎఫ్) అధిక స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, బీజేపీ కూడా తన రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, వామపక్ష కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేసిన లెఫ్ట్ కార్యకర్త ఒకరు తన ‘‘మీసం’’ కోల్పోవాల్సి వచ్చింది.
R Sreelekha: కేరళలో కమల వికాసానికి నిదర్శనం రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ కైవసం. వామపక్ష, కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్రంగా ఉండే కేరళలో, బీజేపీ రాజధానిని గెలుచుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 45 ఏళ్ల నిరంతర సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి పాలనకు బీజేపీ ముగింపు పలికింది.