ఎంతటివారికైనా కొన్నిసార్లు నిరసన తప్పదు.. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు పి. చిదంబరానికి నిరసన సెగ తాకింది… ఓ కేసులో వాదించేందుకు హైకోర్టుకు న్యాయవాదిగా వెళ్లారు చిదంబరం.. అయితే, ఆయన్ను కాంగ్రెస్ మద్దతుదారులైన న్యాయవాదులు అడ్డుకున్నారు… పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ పనితీరుకు చిదంబరం కారణమంటూ మండిపడ్డారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేశారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు..
Read Also: Koratala shiva : క్రేజీ కాంబో.. ఎన్టీఆర్-సాయి పల్లవి..?
ఓ కేసులో హైకోర్టుకు హాజరై వాదనలు వినిపించిన చిదంబరం.. తిరిగి కోర్టు నుండి బయటకు వెళ్తుండగా.. కాంగ్రెస్ లాయర్స్ సెల్‌కు చెందిన కొందరు న్యాయవాదులు చిదంబరానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అంతేకాదు.. మమతా బెనర్జీకి సానుభూతిపరుడు (దలాల్) అని పిలుస్తూ నిరసన తెలిపారు. నల్ల వస్త్రాలు, నల్ల జెండాలు చూపిస్తూ.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రోకర్‌గా పనిచేశారని మండిపడ్డారు.. పశ్చిమ బెంగాల్‌లోకాంగ్రెస్ పార్టీ దుస్థితికి కారణం మీరేనంటూ ఆరోపించారు న్యాయవాదులు.