Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Latest Survey On Lok Sabha Elections

Latest Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..? గెలిచే పార్టీ ఏది? ప్రధాని ఎవరు?

Published Date :July 29, 2022 , 9:13 pm
By Sudhakar Ravula
Latest  Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..? గెలిచే పార్టీ ఏది? ప్రధాని ఎవరు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. గెలిచేది ఎవరు? మళ్లీ ప్రధాని అయ్యేది ఎవరు? అంటూ ఇండియా టీవీ ‘వాయిస్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఒపీనియన్ పోల్ నిర్వహించింది… ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది.. ఉన్నట్టుండి ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా వేసింది.. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 362 లోక్‌సభ స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని.. దేశవ్యాప్తంగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో తేలిందని పేర్కొంది.

Read Also: Balineni Srinivasa Reddy: నేను క్యాసినోలకి వెళ్తా.. పేకాట ఆడుతా.. కానీ!

ఇక, ఆ సర్వే ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ఇప్పుడే సాధారణ ఎన్నికలు జరిగితే 97 లోక్‌సభ సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేసింది.. చిన్న, ప్రాంతీయ పార్టీలు మరియు స్వతంత్రులతో సహా ‘ఇతరులు’ 84 సీట్లలో విజయం సాధిస్తారని పేర్కొంది.. మొత్తంగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది. రాష్ట్రాల వారీగా స‌ర్వేలో వెల్ల‌డించిన వివ‌రాలు ఆసక్తికరంగా ఉన్నాయి.. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో, 80 లోక్‌సభ సీట్లలో ఎన్డీఏ అత్యధికంగా 76 గెలుచుకోవచ్చు అని పేర్కొంది. బీహార్‌లో మొత్తం 40 సీట్లలో ఎన్డీఏ 35, యూపీఏ ఐదు సీట్లు గెలుచుకోవచ్చు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్‌డీఏ 37 సీట్లు గెలుచుకోగా, బీజేపీయేతర ప్రతిపక్షాలు మిగిలిన 11 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే నేతృత్వంలోని యూపీఏ మొత్తం 39 స్థానాలకు గాను 38 స్థానాలు గెలుచుకుంటుందని, మిగిలిన ఒక్క సీటును ఎన్డీఏకు వదిలివేస్తుందని అంచనా.. ఇక, ఎల్‌డీఎఫ్ అధికారంలో ఉన్న కేరళలో బీజేపీయేతర ప్రతిపక్షం రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోగలదు అని పేర్కొంది.. ఇక, టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో, మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ మొత్తం 42 సీట్లలో 26 స్థానాలు.. ఎన్డీఏ 14 మరియు యూపీఏ రెండు గెలుస్తుందని అంచనా వేసింది. మరోవైపు.. ప్రధాని ఎవరైతే బాగుంటుందనే ప్రశ్నకు మరోసారి నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపారు ప్రజలు.. 48 శాతం మంది నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. మోడీ తర్వాతి స్థానాల్లో రాహుల్ గాంధీ 11 శాతం, మమతా బెనర్జీ 8 శాతం, సోనియా గాంధీ 7 శాతం, మాయావతి 6 శాతం, శరద్ పవార్ 6 శాతం, అరవింద్ కేజ్రీవాల్ 5 శాతం, నితీష్ కుమార్ 4 శాతం, తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు 3 శాతం, ప్రియాంక వాద్రా 2 శాతంతో ఉన్నారు.

అయితే, ప్రధాని నరేంద్ర మోడీకి బలమైన రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న ప్రశ్నకు 23 శాతం మంది రాహుల్ గాంధీయే అని అభిప్రాయపడ్డారు.. 19 శాతం మంది అరవింద్ కేజ్రీవాల్‌ను ఎంచుకోగా.. 11 శాతం మంది మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు. 8 శాతం మంది నితీష్ కుమార్, సోనియా గాంధీగా పేర్కొన్నారు.. ఇండియా టీవీ-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ జులై 11 నుండి 24 వరకు సర్వే నిర్వహించింది.. 136 పార్లమెంట్‌ స్థానాల్లో 34,000 మంది అభిప్రాయాలు తీసుకుంది.. వీరిలో 19,830 మంది పురుషులు మరియు 14,170 మంది మహిళలు ఉన్నారని పేర్కొంది.

ఇక, సర్వే ఫలితాల ప్రకారం.. వివిధ రాష్ట్రాల్లో ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని పరిశీలిస్తే..
– గుజరాత్‌: మొత్తం 26 స్థానాలు.. ఎన్డీఏకు 26
– మహారాష్ట్ర: మొత్తం 48 స్థానాల్లో ఎన్డీఏకు 37, యూపీఏకు 11
– గోవాలోని రెండు లోక్‌సభ స్థానాలు ఎన్డీఏకే
– రాజస్థాన్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏదే విజయం
– మధ్యప్రదేశ్: మొత్తం 29 స్థానాలకు గాను.. ఎన్డీఏ 28, యూపీఏ 1 స్థానం..
– ఛత్తీస్‌గఢ్: మొత్తం 11 స్థానాల్లో ఎన్డీఏకు 10, యూపీఏకు ఒకటి
– పశ్చిమ బెంగాల్: మొత్తం 42లో ఎన్డీఏకు 14, టీఎంసీకి 26, యూపీఏకు 2 స్థానాలు
– బీహార్: మొత్తం 40 స్థానాల్లో ఎన్డీఏకు 35, యూపీఏకు 5 సీట్లు
– జార్ఖండ్: మొత్తం 14లో ఎన్డీఏకు 13, యూపీఏకు ఒకటి
– ఒడిశా: మొత్తం 21లో ఎన్డీఏకు 11, యూపీఏకు 2, ఇతరులు (BJDతో సహా) 8 స్థానాలు
– హిమాచల్ ప్రదేశ్: మొత్తం 4 స్థానాల్లో ఎన్డీఏదే విజయం
– పంజాబ్: మొత్తం 13, ఎన్డీఏ 3, యూపీఏ 3, ఇతరులు (AAPతో సహా) 7
– హర్యానా: మొత్తం 10, ఎన్డీఏకు 9, యూపీఏకు ఒకటి
– జమ్మూ & కాశ్మీర్, లద్దాఖ్: మొత్తం 6లో ఎన్డీఏకు 3, ఇతరులకు 3 స్థానాలు
– ఢిల్లీ: మొత్తం 7 స్థానాల్లో ఎన్డీఏదే విజయం
– ఉత్తరప్రదేశ్: మొత్తం 80 స్థానాల్లో ఎన్డీఏకు 76, యూపీఏకు 2, ఇతరులు 2
– ఉత్తరాఖండ్: మొత్తం 5 స్థానాల్లో ఎన్డీఏ కూటమిదే విజయం
– తెలంగాణ: మొత్తం 17, ఎన్డీఏ 6, యూపీఏ 2, ఇతరులు (టీఆర్‌ఎస్‌తో సహా) 9 స్థానాలు.
– ఆంధ్రప్రదేశ్: మొత్తం 25ల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులదే గెలుపు
– కర్ణాటక: మొత్తం 28, ఎన్డీఏ 23, యూపీఏ 4, ఇతరులు 1.
– తమిళనాడు: మొత్తం 39, ఎన్డీఏ 1, యూపీఏ (డీఎంకెతో సహా) 38
– కేరళ: మొత్తం 20 స్థానాల్లో యూపీఏ 20 స్థానాలు కైవసం చేసుకుంటుంది.
– త్రిపుర: మొత్తం 2 స్థానాలు ఎన్డీఏ ఖాతాలోనే
– అస్సాం: మొత్తం 14 స్థానాల్లో ఎన్డీఏ 11, యూపీఏ 1, ఇతరులు 2

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Desh Ki Awaaz
  • Latest Survey
  • Latest Survey on Lok Sabha Elections
  • Lok Sabha Elections
  • National Democratic Alliance

తాజావార్తలు

  • S.S.Thaman: తమన్ ప్రయాణం.. ‘బాయ్స్’ నుంచి ‘ఓజీ’ వరకు.. మైలురాళ్లు ఇవే!

  • ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!

  • Telangana Budget 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Megastar Chiranjeevi : ఎన్టీఆర్ నేషనల్ అవార్డు స్వీకరించడంపై చిరు ఎమోషనల్ ట్వీట్…

ట్రెండింగ్‌

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions