Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో లష్కర్ తోయిబా ఉగ్రవాది అరెస్ట్.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Lashkarterroristarrested

Lashkarterroristarrested

దేశంలో మరో భారీ ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశారు. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో జరిగినట్లుగా మరో భారీ కుట్రకు పాల్పడుతున్న ఉగ్రవాదుల పన్నాగాన్ని ఛేదించారు. ఢిల్లీ సరిహద్దులో లష్కర్ తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్‌ను భద్రతా దళాలు అరెస్ట్ చేసి అతి పెద్ద విజయాన్ని సాధించారు. లేదంటే మరోసారి భారతదేశంలో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది.

పాకిస్థానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్‌లో కొత్త లష్కర్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేసేందుకు పనిచేస్తున్న షబ్బీర్ అహ్మద్ లోన్‌ను ఢిల్లీ సరిహద్దులో భద్రతా సంస్థలు విజయవంతంగా అరెస్టు చేశాయి.  ఒక సమాచారం ఆధారంగా.. ఢిల్లీ పోలీసులు, భద్రతా దళాలు రాజధాని సరిహద్దులో పక్కా ప్రణాళికతో ఉచ్చు పన్ని పట్టుకున్నారు. సరిహద్దు అవతల నుంచి అందిన ఆదేశాల మేరకు భారత్ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టే లక్ష్యంతో ఉగ్రవాది ఉన్నట్లుగా విచారణలో వెల్లడైంది.

షబ్బీర్ అహ్మద్ లోన్ అరెస్ట్ తర్వాత విచారణ అధికారులు మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇంకెంత మంది సహచరులు దాగి ఉన్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తరహాలోనే మరో కుట్రకు తెరలేపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

భారత్ వ్యతిరేక పోస్టర్లు
ఇటీవల ఢిల్లీ, దక్షిణ భారతదేశంలో లష్కర్ తోయిబా ముఠాను ఛేదించారు. ఈ ముఠా ఢిల్లీ, కోల్‌కతాలోని వివిధ ప్రదేశాల్లో భారతదేశ వ్యతిరేక పోస్టర్లను అంటించింది. తాజాగా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, కేంద్ర ఏజెన్సీలు ఒక పెద్ద విజయాన్ని సాధించాయి.

ఇది కూడా చదవండి: IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

ఇది కూడా చదవండి: Rahul Banerjee: విషాదం.. యువ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత

Exit mobile version