NTV Telugu Site icon

Bihar Politics: అధికారం కోసం లాలూ విశ్వప్రయత్నాలు.. మద్దతు కోసం డిప్యూటీ సీఎం పదవులు ఆఫర్..

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav

Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో బంధం విచ్ఛిన్నమైంది. ఇరు పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. దీంతో మరోసారి నితీష్ కుమార్ తన పాత స్నేహితుడైన బీజేపీ సాయంతో అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే లాలూ కూడా అధికారం కోసం పావులు కుదుపుతున్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 మార్కును చేరుకోవాలి. అయితే ప్రస్తుతం ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలన్నింటికి కలిపి మరో 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. దీంతో ఇతర పార్టీలు, స్వతంత్రులకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మాజీ బీహార్ సీఎం జితన్ రామ్ మాంఝీ కుమారులు తమ మహాఘటబంధన్ లో చేరితో లోక్‌సభ స్థానాలతో పాటు ఉపముఖ్యమంత్రి పదవికి కూడా లాలూ ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు.

Read Also: Bihar: బీహార్‌లో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం.. 28న సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం.!

అయితే, దీనిపై సంతోష్ మాంఝీ మాట్లాడుతూ.. తాము అలాంటి ఆఫర్లకు లొంగిపోమని, మేం ఎన్డీయేతో కలిసి ఉన్నామని, ఇలాంటి ఆఫర్లు వస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. మొత్తం 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీ బలాలను పరిశీలిస్తే..

ఆర్జేడీ-79
బీజేపీ-78
జేడీయూ-45
కాంగ్రెస్-19
వామపక్షాలు-16
హెచ్ఏఎం(ఎస్)-4
ఎంఐఎం-1
ఇండిపెండెంట్-1

దీంతో లాలూ కూటమికి మ్యాజిగ్ ఫిగర్ దాటడం కష్టంగా మారింది. అయితే, అధికారం కోసం అతను విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.