IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- ఐఆర్‌సీటీ స్కామ్‌లో లాలూ కుటుంబానికి షాక్..
- నిందితులపై అనుమానం ఉందన్న ఢిల్లీ కోర్టు..
- 2004-2009 మధ్య రైల్వే హోటల్ కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC Scam Case: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఐఆర్‌సీటీకీ హోటళ్ల కాంట్రాక్టుల వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ మంత్రి లాలూ, ఆయన భార్య రబ్రీ దేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌లతో సహా 9 మందిపై అభియోగాలు నమోదు చేసేందుకు ఢిల్లీలోని రౌస్ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితులపై మనీలాండరింగ్‌కు సంబంధించిన బలమైన అనుమానాలు ఉన్నట్లు న్యాయమూర్తి విశాల్ గోగ్నే పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ కేసు పెట్టారనే నిందితుల వాదనల్ని కోర్టు కొట్టిపారేసింది. తాజా ఉత్తర్వుల్లో ఏడుగురు నిందితుల్ని కోర్టు కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది.
కేసు ఏంటి.?
2004-2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసీ కాంట్రాక్టులకు సంబంధించి స్కామ్ జరిగింది. రాంచీ, పూరీలోని రైల్వే బీఎన్ఆర్ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా సుజాతా హోటల్స్‌కు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. దీనికి ప్రతిఫలంగా పాట్నాలోని విలువైన భూముల్ని లాలూ కుటుంబానికి అనుబంధంగా ఉన్న సంస్థలకు తక్కువ ధరకు బదిలీ చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
Also Read
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
ఈ వ్యవహారంలో కాంట్రాక్టులకు ప్రతిఫలంగా ‘‘క్విక్ ప్రోకో’’గా సీబీఐ ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ ఈ స్కామ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మొత్తం స్కామ్ ద్వారా వచ్చిన పాట్నా భూములపై రబ్రీ దేవీ, తేజస్వీ యాదవ్ నియంత్రణ సాధించారు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఈడీ మనీలాండరింగ్ కేసు ఇప్పుడు ట్రయల్ దశలోకి వచ్చింది. అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు అక్టోబర్ 03 కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.
తాజావార్తలు
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?