NTV Telugu Site icon

PM Modi: “ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు”.. లాలూ వ్యాఖ్యలపై పీఎం మోడీ ఆగ్రహం..

Pm Modi, Lalu

Pm Modi, Lalu

PM Modi: ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముస్లింల పూర్తి రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించడంపై వివాదం మొదలైంది. పాట్నాలో మీడియాతో మాట్లాడిన లాలూ యాదవ్ రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రిజర్వేషన్లను తొలగించాలని అధికార బీజేపీ భావిస్తోందని ఆయన ఆరోపించారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారని ఆర్జేడీ అధినేత అన్నారు.

Read Also: Pannun murder plot: ఖలిస్తాన్ పన్నూ హత్య కుట్రలో భారత్ దర్యాప్తుపై అమెరికా ఎదురుచూపు..

లాలూ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలను మానలేదని, వారికి ఓటేస్తే మీరు శ్వాసించే హక్కును కూడా తీసుకుంటారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న మోడీ మాట్లాడుతూ.. దాణా కుంభకోణంలో నిందితుడు బెయిల్‌పై బయట ఉన్న నాయకుడు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అంటున్నారని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రధాని అన్నారు. ‘‘ కాంగ్రెస్ మౌనంగా ఉంది. కానీ ఈ రోజు దాని మిత్రపక్షాలలో ఒకటి ఇండియా కూటమి ఉద్దేశాలను ధ్రువీకరించింది. ముస్లింలకు ‘సంపూర్ణ’ రిజర్వేషన్లు కావాలని ఆయన అన్నారు. దీని అర్ధం ఏమిటి..?’’ అని ప్రశ్నించారు. తాను జీవించి ఉన్నంత కాలం ‘‘బూటకపు సెక్యులరిజం’’ పేరుతో భారతదేశ గుర్తింపును చెరిపేయడానికి ఎవరినీ అనుమతించనని అన్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేయడం ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆర్జేడీ చీఫ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో పూర్తిగా రిజర్వేషన్లు అనేది చాలా తీవ్రమైందని, వారు ఎస్టీ/ఎస్టీ, ఓబీసీ వాటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆర్జేడీకి యాదవులను కాదని ముస్లింలు తొలి ప్రాధాన్యంగా మారిందని దుయ్యబట్టారు.