Site icon NTV Telugu

Lalu Prasad: ‘అబద్ధాల రాజు’.. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై లాలూ ప్రసాద్ మండిపాటు

Lalu Prasad

Lalu Prasad

బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అధికార-ప్రతిపక్ష కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తున్నాయి. విమర్శలు-ప్రతి విమర్శలతో వేడి పెంచుతున్నారు. ప్రధాని మోడీ శుక్రవారం.. విపక్ష కూటమి లక్ష్యంగా విమర్శలు గుప్పించగా… తాజాగా ప్రధాని మోడీని టార్గెట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతి దాడికి దిగారు.

డబుల్ ఇంజిన్ సర్కార్.. అబద్ధాల రాజుగా లాలూ ప్రసాద్ యాదవ్ అభివర్ణించారు. ‘‘నిరాకరణీయమైన అబద్ధాల రాజు’’, ‘‘నినాదాల అధిపతి’’ అయిన మోడీ.. దేశంలోని మొత్తం 13,198 రైళ్లలో 12,000 రైళ్లు ఛత్ పండుగ సందర్భంగా బీహార్‌కు వెళ్తాయని బిగ్గరగా చెప్పారని… ఇది కూడా పచ్చి అబద్ధమే అని తేలిందని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Delhi: దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు

20 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో వలసల కష్టాలను భరించిన బీహారీలు.. ఛత్ అనే గొప్ప పండుగ సమయంలో కూడా సరైన రైలు సేవలను పొందలేకపోయారని పేర్కొన్నారు. ‘‘నా తోటి బీహార్ వాసులు అమానవీయ పరిస్థితుల్లో రైళ్లలో ప్రయాణించవలసి వస్తుంది. ఇది ఎంత సిగ్గుచేటు?.’’ అంటూ లాలూ ప్రసాద్ విరుచుకుపడ్డారు. ‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా బీహార్ నుంచి ప్రతి సంవత్సరం 4 కోట్లకు పైగా ప్రజలు పని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. యూపీఏ కాలం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం బీహార్‌లో ఎటువంటి ప్రధాన పరిశ్రమలను స్థాపించలేదు. ఈ వ్యక్తులు స్పష్టంగా బీహార్ వ్యతిరేకులు..’’ అంటూ లాలూ ప్రసాద్ ఎక్స్‌లో ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Osama bin Laden: ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలు జరుగుతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే నేటి నుంచి నాలుగు రోజుల పాటు బీహార్‌లో ఛత్ పండుగ జరగనుంది. ఈ వేడుకల కోసం రాష్ట్రం బయట ఉన్నవారంతా గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సులు, వాహనాలు ఫుల్ రష్‌గా ఉంటున్నాయి.

 

Exit mobile version