Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- 16 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్నట్లు లలిత్ మోదీ ప్రకటన.
- 2009 IPL FEMA కేసులో ట్రైబ్యునల్ నుంచి కీలక ఊరట.
- ED ఆరోపణలలో ఎక్కువ భాగాన్ని ట్రైబ్యునల్ కొట్టివేసింది.
- ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది భారత్‌కు రానున్నట్లు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalit Modi: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 16 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్‌కు సంబంధించి విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్ నుంచి కీలక ఊరట లభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2010 నుంచి లలిత్ మోడీ విదేశాల్లో ఉంటున్నారు. 16 ఏళ్ల న్యాయ పోరాటానికి ముగింపు వచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ రావాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
ట్రైబ్యునల్ తీర్పులో నిజం వెలుగులోకి వచ్చిందని, ఐపీఎల్ ప్రయోజనాల కోసమే తాను పనిచేశానని, ఇప్పుడు ఆ అధ్యాయం ముగిసిందని, భారత్ తిరిగి రావాలని అనుకుంటుననట్లు లలిత్ మోడీ చెప్పారు. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్ కోసం నిధుల తరలింపులపై FEMA కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విధించిన చాలా ఆరోపణల్ని, జరిమానాలను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్స్ (ఫార్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ) చట్టం (SAFEMA) కింద ఉన్న అప్పీలేట్ ట్రైబ్యునల్ కొట్టివేసింది.
Also Read
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్‌పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం, 2009 ఐపీఎల్ నిర్వాహణ కోసం జరిగిన విదేశీ నిధుల బదిలీల్లో లలిత్ మోడీ FEMA ఉల్లంఘనలకు బాధ్యుడని నిరూపించే ఆధారాలేవి లేవని పేర్కొంది. జూలై 16న తీర్పు వెలువడింది. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను భారత్ నుంచి దక్షిణాఫ్రికా తరలించారు. ఈ టోర్నీ నిర్వహణ కోసం విదేశీ చెట్టింపులపై ఆర్బీఐ అనుమతి అవసరమని పేర్కొంటూ ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
#WATCH | IPL founder and first chairman Lalit Modi to return to India.
He says, "I'm really happy with the verdict yesterday. It's really been a great day. 16 years I have fought and whatever I have been saying to the media and to everybody has finally emerged as the truth. I'm… pic.twitter.com/QTN7VkzuEy
— ANI (@ANI) July 22, 2026
తాజావార్తలు
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!