Lakshadweep: ప్రధాని నరేంద్రమోడీ ‘‘కుర్చీ మడతపెడితే’’ ఏమవుతుందో మాల్దీవులకు తెలిసి వచ్చింది. ఇదే సమయంలో మోడీ మాటను భారతీయుల ఎలా వింటారనే దానికి ‘‘లక్షదీవులే’’ నిదర్శనం. 2024లో మాల్దీవులు భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభించింది. ప్రధాని మోడీపై అక్కడి ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు ‘‘ఇండియా అవుట్’’ అనే నినాదంలో అధికారంలోకి వచ్చారు. ఇదే కాకుండా తన తొలి పర్యటన చైనాలో చేశారు. సహజంగా మాల్దీవుల్లో ఏ కొత్త ప్రభుత్వం వచ్చినా, ప్రభుత్వాధినేత భారత్ సందర్శించడం ఆనవాయితీగా వచ్చింది. కానీ ముయిజు మాత్రం చైనాకు సపోర్ట్ చేశాడు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ లక్షదీవుల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఒక బీచ్‌లో ఒక కుర్చీలో కూర్చుని లక్షదీవుల అందాన్ని వీక్షిస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇంకేముంది మన దేశంలో పర్యాటకులు లక్షదీవులకు క్యూ కట్టారు. 2020లో కేవలం 3,875 నుండి 2024 నాటికి రికార్డు స్థాయిలో 68,328కి పెరిగింది. 2024 జనవరిలో ప్రధాని మోదీ ఈ ద్వీపాన్ని సందర్శించిన తర్వాత పర్యాటకుల సంఖ్యలో ఈ భారీ పెరుగుదల కనిపించింది.లక్షద్వీప్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య 2023లో 46,551 నుండి 2024 నాటికి 68,328కి పెరిగింది. ఇది ఒక సంవత్సరంలోనే దాదాపు 47 శాతం పెరుగుదల.
ఇదే సమయంలో మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2023లో 209,193 నుండి 2024 నాటికి 130,805కి పడిపోయింది. ఇది 37.5 శాతం తగ్గుదల. మాల్దీవులకుకు వెళ్లే పర్యాటకుల్లో భారతీయులే అధికారం. మన దేశ పర్యాటకులు వెళ్లకుంటే మాల్దీవుల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. చివరకు మాల్దీవులు కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది. ఒకప్పుడు మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో భారతీయలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, ఆ దేశ ప్రభుత్వం బలుపు మాటల కారణంగా ఆరో స్థానానికి చేరింది. మోడీ పిలుపుకు స్పందించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, ట్రావెల్ ఫ్లాట్‌ఫారమ్స్ లక్షదీవుల పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించారు.
