Pakistan: సాక్ష్యాత్తు అమెరికా అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ దేశ విదేశాంగ శాఖ, పెంటగాన్ పాకిస్తాన్‌తో అటంకాగుతోందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (మాజీ) హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్ చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాకిస్తాన్‌కి సహాయం ఆపేయాలని ఆయన చెప్పినప్పటికీ విదేశాంగ శాఖ, పెంటగాన్ పాకిస్తాన్‌తో సంబంధాలు కొనసాగించాయని మెక్‌మాస్టర్ రాసిన పుస్తకం ‘‘ఎట్ వార్ విత్ అవర్ సెల్వ్స్: మై టూర్ ఆఫ్ ఢ్యూటీ ఇన్ ది ట్రంప్ వైట్‌హౌజ్’’లో పేర్కొన్నారు. ఈ పుస్తకం ద్వారా అమెరికా పాకిస్తాన్‌కి ఎలా సాయం చేసిందనే విషయాన్ని వివరించింది.
Read Also: Champions Trophy 2025: భద్రత విషయంలో ఆందోళన ఉంది.. టీమిండియా క్రికెటర్లు పాకిస్తాన్ వెళ్లొద్దు
ట్రంప్ హయాంలోని రక్షణ మంత్రి జిమ్ మాటిస్ పాకిస్తాన్‌కి 150 మిలియన్ డాలర్ల విలువైన సాయుధ ప్యాకేజ్ ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు బుక్‌లో పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో సైనిక వాహనాలు కూడా ఉన్నాయి. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీనిని ఆపేసిందని మెక్‌మాస్టర్ తెలిపారు. ‘‘ ట్రంప్ చెప్పిన మార్గదర్శకాల మేరకు ఇలాంటి పనులు చేయకుండా ఆమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖలను ఆపడం చాలా కష్టం. ఈ వైరుధ్యాలను దక్షిణాసియా వ్యూహంలో గుర్తించాను. దీనిలో పాకిస్తాన్‌కి అన్ని రకాల సాయాలను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. ఏవో కొన్ని చిన్నపాటి మినహాయింపులే ఉన్నాయి. అదే సమయంలో మ్యాటిస్ ఇస్లామాబాద్ వెళ్లాని నిర్ణయించుకున్నారు. మరోవైపు పెంటగాన్ కూడా సైనిక వాహనాలతో కూడిన 150 మిలియన్ డాలర్ల మిలిటరీ ప్యాకేజీని పాక్‌కి ఇచ్చేందుకు సిద్ధమైంది’’ అని తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే తాను రక్షణ మంత్రి మాటిస్, సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ గీనా హస్పెల్, ఇతర సీనియర్ అధికారులతో భేటీ అయ్యానని చెప్పారు. ఉగ్రవాదానికి పాక్ సాయం చేయడం ఆపేంత వరకు ట్రంప్ ఎలాంటి సాయం చేయవద్దని పలుమార్లు స్పష్టంగా చెప్పారని, అక్కడి ఉగ్రవాదులు ఆఫ్గానీ ప్రజలు, అమెరికన్లను, సంకీర్ణ బలగాలను చంపుతున్నాయని, పాక్ డబ్బు వెళ్లకూడదని ట్రంప్ చెప్పడాన్ని మనం విన్నాం అని మెక్‌మాస్టర్ చెప్పారు. మాటిస్ మాత్రం ఆయుధ ప్యాకేజీని నిలిపేనా, ఇతర సాయాలను మాత్రం కొనసాగించారని పేర్కొన్నారు. మరోవైపు జిమ్ మాటిస్ ఇస్లామాబాద్ పర్యటనకు వెళ్లిన సమయంలోనే పాక్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ని విడుదల చేయడం అమెరికాకు అవమానకరమైన మెక్‌మాస్టర్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఉగ్రవాదులు, పాక్ ఐఎస్ఐకి ఉన్న సంబంధాలను పుస్తకంలో ప్రస్తావించారు.