Kolkata rape-murder case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నిందితుడిని వెంటనే శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్‌ని ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది.